పవన్ ను వెంటాడుతున్న నెగటివ్ సెంటిమెంట్.. అది బ్రేక్ చేస్తే వీరమల్లు జాతరే

ప్రస్తుతం ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు ట్రైనింగ్ గా నడుస్తుంది. సినిమా టికెట్ కాస్ట్, ప్రీమియర్ షోల వివరాలు, సినిమా రిజల్ట్ ఎలా ఉండతునుంద‌నే చర్చలు తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. రిలీజ్ కు ముందు సినిమా ఊహించని ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక మేక‌ర్స్‌ ఆ అని అడ్డంకుల‌ను అధిగమించి.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నైజంలో సినిమా ధియేటర్ల సమస్య ఎదురు కాగా.. ఏపీలో ప్రీమియర్ షోస్‌తోనే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చేలా ప‌రిస్థితి నెల‌కొంది.

దాదాపు మూడున్నర ఇళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అది కూడా పవన్ కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. ఆడియన్స్ లో సినిమా పై భారీ హైప్ నెలకొంది. ఇక సినిమా ఏళ్ల తరబడి షూట్‌ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షూట్‌కు ఎక్కువ సమయం తీసుకున్న సినిమాలేవి సక్సెస్ సాధించిన దాఖలాలు లేవు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు వీరమల్లును వెంటాడుతుంది. ఈ సెంటిమెంట్ తోపాటు.. సినిమాను అమావాస్య రోజు రిలీజ్ చేస్తున్నారని మరో బ్యాడ్‌ సెంటిమెంట్ వెంటాడుతుంది. ఈ రెండు సెంటిమెంట్లను వీరమల్లు బ్రేక్ చేస్తే చాలు.. బాక్సాఫీస్ దగ్గర వీర‌మ‌ల్లు జాతర చూడొచ్చు.

ఇప్పటికే హరిహర వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్‌లు భారీ లెవెల్ లో అంచలనాలు సృష్టిస్తుంది. ఏపీ, తెలంగాణలో పలు థియేటర్స్‌లో టికెట్లు హాట్‌ కేకుల్లా అపుడుపోతున్నాయి. ఓవర్సీస్ లోనూ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుంది. పవర్ స్టార్ మ్యానియా మరోసారి ఓపెన్ బుకింగ్స్ తోనే ప్రూవ్‌ అయింది. ఇక సినిమా ఏదైనా దాని నెగటివ్ సెంటిమెంట్ల కంటే ఫస్ట్ వచ్చే రివ్యూ పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. కనుక పవన్ కళ్యాణ్ నటన.. కీరవాణి మ్యూజిక్ తో పాటు.. క్రిష్, గోపి కృష్ణ దర్శకత్వం ఆడియన్స్‌ను విజువల్ పరంగా ఆకట్టుకుంటే చాలు.. సినిమాకు ఆటోమేటిక్గా పాజిటివ్ టాక్ వచ్చేస్తుంది. ఈ సినిమాతో పవన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.