మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. తను నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి చివరిగా పాన్ ఇండియా లెవెల్లో గేమ్ ఛేంజర్ సినిమా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ఆయనా.. వెనరు తగ్గకుండా.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కష్ట పడుతున్నాడు చరణ్.
ప్రస్తుతం ఉప్పెన సెన్సేషనల్ డబ్ల్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సన్నాతో ఆయన పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మాస్ అండ్ మోటివేషనల్ స్టోరీగా రూపొందుతున్న ఈ కథలో.. చరణ్ సరసన హీరోయిన్గా జాన్వి కపూర్ మెరవనుంది. అంతేకాదు.. కోలీవుడ్ నటుడు శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్రలో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. అయితే.. సినిమా స్టోరీ కి ప్రాధాన్యమున్న సన్నివేశాలన్నీ విజయనగరం బ్యాక్ డ్రాప్ లో రూపొందించాల్సి ఉందట. ఈ క్రమంలోనే అక్కడ వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో అదే సెట్ హైదరాబాద్‌లో వేసి షూట్‌ను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సెట్స్ కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. ఈ క్రమంలోనే క్రికెటర్ పాత్రలో మెరవనున్నాడు చరణ్. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌కు ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది, కాగా.. లుక్ వైవిధ్యంగా ఉన్నప్పటికీ.. ఆడియన్స్‌ను మెప్పించింది. వచ్చే ఏడాదిలో సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ. ఆర్. రెహమాన్ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని ట్యూన్స్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. మాస్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథకు రెహమాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో హైలెట్ కానుందట. ఇక పెద్ది కోసం చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ తాజాగా వైరల్ గా మారాయి. ఈ పిక్ లో చరణ్ రఫ్ అండ్ రగడ్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. సినిమా కోసం చరణ్ కష్టాన్ని చూసి అభిమానులు పొగడ్తలతో ముంచేస్తున్నారు.