తారక్ వార్ 2 క్రేజీ రికార్డ్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగెస్ట్ రిలీజ్..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో.. కీయారా అద్వాని హీరోయిన్గా మెరవనుంది. 2026 ఆగస్టు 14 వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ చేయనున్నారు మేక‌ర్స్‌. ఇలాంటి క్ర‌మంలో వార్ 2 ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక క్రేజీ రికార్డును సొంతం చేసుకుందంటూ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటివరకు లేనివిధంగా ఇండియా వ్యాప్తంగా ఏకంగా 9000 స్క్రీన్‌లలో సినిమాలో రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.

ఇక.. ఇప్పటివరకు ఈ రేంజ్‌లో థియేటర్‌ల‌లో సినిమా రిలీజ్ అయింది లేదు. గతంలో 7,500 స్క్రీన్ లతో.. రోబో 2.0 ఒక గ్రాండ్ రికార్డ్ క్ర‌యేట్ చేసింది. ఇప్పుడు వార్ 2 ఇండియన్ బిగ్గెస్ట్ రిలీజ్ తో రోబో 2.0 రికార్డు తుక్కుతుక్కు చేయనుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తారక్ కెరీర్‌లోనే మొట్టమొదటి బాలీవుడ్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. చివరిగా తారక్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజై.. ఆడియన్స్‌లో మరింత ఆశక్తిని నేలకొల్పిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే.. అందుతున్న‌ సమాచారం ప్రకారం.. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా.. హృతిక్ రోషన్ బలమైన విలన్ గా నటించబోతున్నారని తెలుస్తోంది. టీజర్ చూసిన ఆడియన్స్‌లో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇక ఎన్టీఆర్ హీరో అని తెలియడంతో టాలీవుడ్ ఆడియన్స్‌లో మరింత ఉత్సాహం మొదలైంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కాసుల వ‌ర్షం కాయ‌మంటూ అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.