హరిహర వీరమల్లు పై స్టార్ క్రిటిక్ షాకింగ్ రివ్యూ.. కెరీర్ క్లోజ్ అంటూ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు. యాక్షన్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు నెల‌కొన్నాయి. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా కావడం. దానికి తోడు పవన్ ప్రాజెక్టును ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో సైతం సందడి చేయడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మరింత హైప్‌ను పెంచాయి. అయితే.. సినిమాపై దాదాపు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. కొంతమంది నుంచి మాత్రం సినిమాపై నెగటివ్ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సినిమా పెద్దగా ఆకట్టుకోలేదంటూ కామెంట్లు వినిపిస్తున్న. ఈ కథ, కథనం బాగున్న డైరెక్షన్ ఆక‌ట్టుకోలేదని.. జ్యోతి కృష్ణకు అనుభవం లేకపోవడంతో పవన్ లాంటి స్టార్ హీరోని హ్యాండిల్ చేయలేకపోయాడంటూ.. దాని ప్రభావం సినిమాపై బాగా పడిందంటూ పలువురు విశ్లేషకులు సైతం వెల్లడించారు. క్రిష్‌ జాగర్లమూడి కథ‌ అందించగా.. దాన్ని తెరపైకి తీసుకురావడంలో పలు లోపాలు ఉన్నాయంటూ విశ్లేషకులు వివరించారు. ఇక సినిమాలో కోర్‌ ఎమోషన్స్ మిస్ అయ్యాయ‌ని.. ఈ క్రమంలోనే ఆడియన్స్ సినిమాతో కనెక్ట్ కాలేకపోతున్నారంటూ సమాచారం.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగిందని.. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన రివ్యూ ను షేర్ చేసుకున్నాడు. హరిహర వీరమల్లు యావరేజ్ కంటే తక్కువ అంటూ నెగటివ్ రివ్యూ ఇచ్చినా.. ఆయన సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదని చెప్పుకొచ్చాడు. అంతకంటే ఎక్కువగా రెచ్చిపోతూ సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్ ముగిసిపోయినట్లే అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ఈ ట్విట్ నెటింట‌ వైరల్ గా మారడంతో.. పవన్ ఫ్యాన్స్ ఉమైర్ సంధును బండ బూతులతో ఆడేసుకుంటున్నారు. అసలు మీలాంటి తప్పుడు రివ్యూ ఇచ్చే వాళ్లకు సరైన శిక్ష ఉండాలంటూ మండిపడుతున్నారు.