టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ప్రపంచ వ్యాప్తంగా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఐదు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం జోరుగా సాగుతున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్‌ని రంగంలోకి దింపి మరీ వరుస ఇంటర్వ్యూలో సందడి చేస్తున్నాడు. పిరియాడిక్ హిస్టోరికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇక ఈ సినిమా పవన్ కెరీర్‌లో మొటమొదటి పాన్ ఇండియన్ మూవీ కావడం.. ఏపీ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమాపై ఫ్యాన్స్‌లో మరింత హైప్ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సెన్సేషనల్ షాక్ తగిలింది. రేపు సినిమా రిలీజ్ అనగా.. స్టార్ యుట్యూబర్ నా అన్వేషణ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్‌ను లీక్ చేసాడు.
ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను చూసామని చాలా అద్భుతంగా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. సినిమాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంట్రీ హైలెట్ అని.. శ్రీకృష్ణదేవరాయలుగా.. వీరమల్లు మనవడి పాత్రలో ఆయన నటించాడు అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్, బాలయ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని.. తప్పకుండా సినిమాను మీరు ఎంజాయ్ చేస్తారంటు నా అన్వేషణ వివరించాడు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు గాని.. ప్రస్తుతం నా అన్వేషణ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది.