తన చివరి సినిమాపై పవన్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీర‌మ‌ల్లు రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ఈ రోజు రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ ప‌డ‌నున్నాయి. దీంతో ఆడియన్స్‌లో నూతన ఉత్సాహం నెల‌కొంది. ఎప్పుడెప్పుడు పవన్ సినిమా చూస్తామంటూ కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక తాజాగా.. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమై అన్ని చోట్ల హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రీమియర్ షోస్ బుకింగ్ కూడా ఒక నైజం ప్రాంతంలో తప్ప.. అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభించేసి.. ఇప్పటికే ఆల్మోస్ట్ అమ్ముడైపోయాయి. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అది కూడా ఓ డైరెక్ట్ ఫిలిం కావడంతో.. అభిమన్యులతో పాటు ఆడియన్స్‌లోను ఈ సినిమాపై హైప్ మొద‌లైంది.

Pawan Kalyan's character in Hari Hara Veera Mallu inspired by legends NTR  and MGR - Hindustan Times

పిరియాడిక్ హిస్టోరిక‌ల్ మూవీగా రానున్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. మునుపెనడలేని రేంజ్ లో పవన్ సైతం ప్రమోషన్ లో పాల్గొని సందడి చేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలో సినిమాపై హైప్‌ పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నాన్స్టాప్గా నేషనల్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్.. లోకల్ గా ఉండే పాపులర్ న్యూస్ ఛానల్ లోకి సైతం ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో అభిమానులకు నచ్చని కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం త‌న చేతిలో ఉన్న మూడు సినిమాలను ముగించేసానని. ఓజీ సినిమా ఇప్పటికే కంప్లీట్ అయింది. ఉస్తాద్ భ‌గత్ సింగ్‌ సినిమా మరో ఆరు రోజుల షూటింగ్ చేస్తే ముగిసిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan's Promotions Boost Hari Hara Veera Mallu Hype - TrackTollywood

తర్వాత పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేలా పనిచేస్తానని.. అది నా ప్రధాన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చిన పవన్.. సినిమా నా జీవనాధారం. ప్రస్తుతానికి నా వద్ద కథ‌లు లేవు. భవిష్యత్తులోన రాజకీయ కార్యక్రమాలకు క్లాష్ రాకుండా ఉంటే సినిమాల్లో కచ్చితంగా నటిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. లేదంటే.. నా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని.. రీ క్రియేట్ చేసి సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానంటూ వివరించాడు. ఆయన మాటలు అభిమానులకు నిరాశను కలిగించాయి. సమయం తీసుకుని అయినా సినిమాలు చేస్తే బాగుంటుందని.. మళ్లీ మ‌ళ్లీ వెండితెరపై పవన్ అన్నను చూడాలని ఆరాటపడుతున్నారు ఫ్యాన్స్. మ‌రి పవన్ రెడీ అంటే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఇప్పటికే లైన్లో ఉంది. దీన్ని ఫ‌క‌యూచ‌ర్‌లో అయినా ఆయన సెట్స్‌పైకి తీసుకువస్తాడో.. లేదో.. వేచి చూడాలి.