హరిహర వీరమల్లు పార్ట్ 2 పై పవన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు మొదట్లోనే ప్రకటించారు మేక‌ర్స్‌. ఇక స్వార్డ్‌ వర్సెస్ స్పిరిట్ మొదటి భాగం జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం పాల్గొని సందడి చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పంచుకుంటున్నాడు. సినిమా రెండో భాగం (పార్ట్ 2) షూటింగ్ సైతం 20 నుంచి 30% వరకు పూర్తయిపోయిందట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. పార్ట్ 2 సినిమాను.. వచ్చే డబ్బులు, తనకున్న సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ నటిస్తానని వివరించాడు. అందుకు భగవంతుడు ఆశీస్సులు ముఖ్యమంటూ చెప్పుకొచ్చిన పవన్.. సినీ ఇండస్ట్రీ ఎక్కడ ఉన్న సమస్య లేదని.. అయితే ఆంధ్రాలో మౌళిక సదుపాయాలతో పాటు.. ఫిలిం మేకింగ్ స్కూల్‌ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చాడు.

ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన కోహినూరు వజ్రాన్ని మళ్లీ తీసుకువచ్చే వీరుడి కథ హరిహర వీరమల్లు.. పూర్తి ఫ్రిక్షనల్ స్టోరీ గా రూపొందింది. సర్వాయి పాపన్న కథతో దీనికి అసలు సంబంధం లేదు అంటూ వివరించాడు. రెండుసార్లు కరోనా కష్టాలు.. తర్వాత డిజాస్టర్ల వల్ల నేను సినిమాలపై దృష్టి సారించలేకపోయా. దీంతో నిర్మాతలు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. దానికి నైతిక బాధ్యత వహించి ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యా. మూవీ రెమ్యూనరేషన్ కూడా లేదు. జిజియా పన్ను ఎపిసోడ్ ఉంటుంది. అదే సమయంలో రాజకీయాలకు అతీతంగా ఈ సినిమా ఉంది. దానిలో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సినిమానా.. రాజకీయాలా.. అంటే నా మొదటి ప్రాధాన్యత మాత్రం రాజకీయాలకే ఇస్తానంటూ చెప్పుకోచ్చాడు. భీమ్లా నాయక్ టికెట్ ధరలు తగ్గినపుడు నేను, నిర్మాత ఇద్దరం భారీగా నష్టపోయాం. సినిమా బాగుందంటే ఆనందిస్తాం.

బాగోలేకపోతే ఎక్కడ తప్పు జరిగిందో ప‌రిశీలిస్తాం.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడూ ఒంటరిగానే ఉంటా అంటూ ప‌వ‌న్ వివ‌రించాడు. నా ఎమ్మెల్యే లందరికీ వాళ్లు కోరుకుంటే ప్రత్యేక షో వేయిస్తాం. సినీ ఇండస్ట్రీ చాలా గ్లామరస్ లుక్ తో ఉంటుంది.. వరుస విజయాల తర్వాత జానీ చేస్తే ఫ్లాప్ అయింది. ఫైనాన్షియర్ లందరూ నా ఇంటికి వచ్చేసారు. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చా. దాంతో పాటు మరొక రూ.15 లక్షలు అప్పు చేసి మరీ వాళ్లకు రిటర్న్ ఇచ్చా. ఈ మూవీ నాకు రాజకీయాల్లో బాగా ఉపయోగపడింది అంటూ పవన్ చెప్పుకొచ్చాడు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నేను బలంగా నిలబడ్డా. కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఏ.ఏం.రత్నం గారు. ఆయనకు అండగా నిలబడాలని సినిమా దగ్గర ఉండి రిలీజ్ చేస్తున్నానంటూ పవన్ వివరించాడు.