పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజై పాజిటీవ్ రిజల్ట్ అందుకుంది. ప్రీమియర్ షోలతోనే కలెక్షన్లు కలగొట్టిన ఈ సినిమా.. ఫస్ట్ డే కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో ఫుల్ జోరులో దూసుకుపోతుంది. ఇక పవన్ లైనప్‌లో సినిమాతో పాటు.. మరో రెండు సినిమాలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో తాజాగా సూజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓజి సినిమా షూట్‌ను పూర్తి చేసుకున్నాడు పవన్. ఇక.. ఈ సినిమా తర్వాత ఆయన లైనప్‌లో ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాల్లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా.. రాశిఖన్నా మరో కీలక పాత్రలో మెరవనుంది.
ఈ క్రమంలోనే హరీష్ శంకర్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. పవన్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ సినిమాకు ఎలాంటి స్పెషల్ ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 10 ఏళ్లపాటు.. క్లీన్ హిట్ లేక సతమతమైన పవన్‌కు గబ్బర్ సింగ్‌తో గ్రేట్ రిలీఫ్ వచ్చింది. ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడుగా వ్యవహరించాడు. ఈ క్రమంలో పవన్ అభిమానులలో.. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ మూవీ అంటే మంచి హైప్ నెలకొంది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకోవచ్చిన తర్వాత ఇది పేరి రిమేక్ అనే వాదన వినిపించింది. ఇక రాజకీయలలో ఫుల్ బిజీగా గడుపుతున్న పవన్.. మూవీని చాలా కాలం పక్కన పెట్టేసాడు.
ఏపీ డిప్యూటీ సీఎం గా 2024 ఎన్నికల్లో సక్సెస్ సాధించిన తర్వాత.. పదవి విధులను నిర్వర్తిస్తూనే.. మరోపక్క షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇలాంటి క్రమంలో పవన్ షూటింగ్ కోసం కేటాయించిన డేట్స్ హరిష్ శంకర్ సరిగ్గా వాడుకోవడం లేదని తెలుస్తుంది. ఉన్న అతి తక్కువ సమయాన్ని ఇలా వేస్ట్ చేసేస్తే తన బిజీ ష్కెడ్యూల్‌లో డేట్స్ కేటాయించడం మరింత కష్టమవుతుందని భావించిన పవన్.. తనకు డేట్స్ ఉన్న సమయంలో హరీష్ శంకర్ సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడట. హరీష్ పై పవన్ కళ్యాణ్ మండి పడటంతో అలిగిన హరీష్ రెండు రోజులు సెట్స్ లోకి కూడా రాలేదట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే న్యూస్ వైరల్ గా మారుతుంది.