టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన శుభవేళ వచ్చేసింది. పవన్ హరిహర వీరమల్లతో గత కొద్దిసేపటి క్రితం గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక పవన్ నుంచి సుద్ధీర్గ కాలం గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. అది కూడా డిప్యూటీ సీఎం గా పవన్ మారిన తర్వాత ఆయన కెరీర్ లో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఉత్సాహం పెరిగింది.
ఈ క్రమంలోని పవన్ అభిమానులు థియేటర్లో సందడి చేస్తున్నారు. పండగ చేసుకుంటున్నారు. చాలా చోట్ల ర్యాలీలు, పాలాభిషేకాలు అంటూ సందడి చేస్తున్నారు. అలా తాజాగా నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఎన్నో చోట్ల వీరమల్లు ప్రీమియర్ షో సొ వేశారు. హైదరాబాద్లో ఈ షోలు ఎక్కువగా నిర్వహించారు. అయితే.. సినిమాలకు ఫేమస్ అయినా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చెరుకోవడంతో.. ఎప్పటిలాగే థియేటర్ వద్ద రచ్చ మొదలైంది. కానీ.. పుష్ప 2 ఘటనతో ఎలర్టైన పోలీసులు.. ఇప్పటికీ అదే సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు.
వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తమై.. ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కావాలంటే టికెట్లు ఉన్న వాళ్ళని మాత్రమే థియేటర్లోకి అనుమతించి.. థియేటర్ లోపల కూడా అల్లర్లు జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. థియేటర్ చుట్టుపక్కల జనాలు గుమికూడకుండా అందరిని పంపించేశారు. ఫ్యాన్స్ హడావిడి చేయవచ్చును భావించిన పోలీసులు.. ర్యాలీలు లాంటి వాటికి పర్మిషన్లు ఇవ్వడం లేదని.. ఎలాంటి తప్పు జరగకుండా ఈసారి స్ట్రిక్ నియమాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.