అఫీషియ‌ల్‌.. ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ వ‌చ్చేది అప్పుడే..!

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాలకు సీక్వెల్ వ‌స్తుందంటే చాలు ఆడియ‌న్స్‌లో భారీ బ‌జ్ నెల‌కొంటుంది. ఇక అలా ఓ మూవీ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షోతో మెప్పించగలిగితే ఆ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు.. సిక్వెల్ బాటలో మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అడుగు పెట్ట‌నుంది. ఆ సినిమా మరేదో కాదు లక్కీ భాస్కర్.

ఆ హిట్ మూవీకి సీక్వెల్ ను క‌న్ఫ‌ర్మ్ చేసిన డైరెక్ట‌ర్ | Lucky Bhaskar Sequel  Confirmed, No Sequel for Sar

దుల్కర్ సల్మాన్ హీరోగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా సీతార ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రిలీజై.. కాసుల వర్షం కురిపించింది. రికార్డు లెవెల్ కలెక్షన్లు కొల్లగొట్టింది. గతేడాది అక్టోబర్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకుంది. దుల్కర్ నటన‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్న లక్కీ భాస్కర్ సినిమా సీక్వెల్ కోసం సన్నాహాలు జరుపుతున్నారు మేకర్స్‌.

Lucky Bhaskar Full Movie In Telugu 2024 | Dulquer Salmaan, Meenakshi  Chaudhary | Facts & Explanation - YouTube

ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వెంకి అట్లూరి క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉంటుందని వివరించాడు. అయితే ఈ సీక్వెల్ సెట్స్ పైకి రావడానికి కాస్త సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సూర్య తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం ధ‌నుష్‌తో మ‌రో సినిమా చేస్తే ఛాన్స్ ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కాగానే.. లక్కీ భాస్కర్ 2 స్క్రిప్ట్ పై ఆయన వర్క్ చేయనున్నాడట. ఈ సినిమా సీక్వెల్ సైతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే రూపొందుతుందని తెలుస్తోంది.