” హరిహర వీరమల్లు ” రిజల్ట్ పై రియాక్ట్ అయ్యిన క్రిష్.. హాట్ కామెంట్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్ కి ముందే భారీ అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. గ్రాండ్ లెవెల్లో ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా.. మెల్ల మెల్లగా డిజాస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌తో పాటు.. ఆడియన్స్‌లోను నిరాశ ఎదురయింది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా డిజైన్ చేసినా.. సెకండ్ హాఫ్ స్లోగా ఉందని.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సరిగ్గా లేవంటూ కంటెంట్‌ను లాగ్ చేసినట్లు అనిపించిందంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వరకు డైరెక్టర్ క్రిష్ తెర‌కెక్కెంచ‌గా.. ఆయన తీసిన సన్నివేశాల వరకు ఆడియన్స్ అందరికీ ప్రతి సీన్ మెప్పించింది.

ఈ సినిమాకు డైరెక్టర్గా చివరి వరకు క్రిష్‌ కొనసాగి ఉంటే.. కచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేదంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రిష్ వెళ్లిపోయిన తర్వాత.. ఆయన కాకుండా ఈ ప్రాజెక్టు ఎవరికీ సెట్ కాదని ఆపేసి ఉన్న బాగుండేదని.. అలా కాకుండా జ్యోతి కృష్ణను సినిమాలో డైరెక్టర్ గా తీసుకుని త‌ప్పు చేశారు అంటూ అభిప్రియాలు వ్య‌క్తం అయ్యాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్ గానే సినిమా విషయంపై డైరెక్టర్ క్రిష్ ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. హరిహర వీరమ‌ల్లు గురించి ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు. మీరు హరిహర వీరమల్ల నుంచి ఎందుకు తప్పుకున్నారు..? పవన్ కు మీకు క్రియేటివ్ డిఫరెన్స్ ఉందా..? అందువల్లే మీరు వెళ్లిపోయారు అంటున్నారు నిజమేనా..? అని అడగడంతో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎలాంటి విభేదాలు.. ఎలాంటి ఇష్యూస్ లేవు. అవన్నీ పుకార్లు.

ఫ్యూచర్లో ఆయనతో నేను పని చేసేందుకు కూడా సిద్ధంగానే ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఒక సమయం చూసుకుని ఎందుకు వీరమల్లు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అందరికీ క్లియర్‌గా చెప్తా. పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ లేవు. వీరమల్లు సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందంటూ ఆయన వివరించాడు. కాగా.. సినిమా పవన్ కు ఉన్న క్రేజ్.. సినిమాపై ఉన్న హైప్‌తో ఫస్ట్ భారీ కలెక్షన్లను కొల్లగొట్టినా.. రెండో రోజు నుంచే సినిమా నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపించింది. ఒక్కసారిగా భారీ లెవెల్ లో కలెక్షన్లు పడిపోయాయి. ఇలాంటి క్రమంలో సెకండ్ హాఫ్ ను చేయాలని అసలు ప్రొడ్యూసర్లు కూడా సాహసం చేయరంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పార్ట్ 2 చేసేటట్లు అయితే.. కచ్చితంగా ఆ కథను డైరెక్టర్ క్రిష్ హ్యాండిల్ చేసే అవకాశం ఉందట.