టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు గ్రాండ్గా రిలీజై ప్రీమియర్ షో ముగించుకుంది. దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే మెరవగా.. సత్యదేవ్ మరో ప్రధాన పాత్రలో కనిపించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు.. రవిచంద్రన్ సంగీతం అందించాడు. సుమారు ఏడాదిన్నర పాట షూట్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా అన్ని కార్యక్రమాలను ముగ్గించి..థియేటర్లలో సందడి చేసింది. ఇప్పటికే ఓవర్సీస్, ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ప్రీవియర్ షోస్ ముగ్గిశాయి. ఇక సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలు ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. సినిమా ఎలా ఉందో.. విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్ కొట్టాడా.. లేదా.. రివ్యూ లో చూద్దాం.
శ్రీలంక జైలు కానిస్టేబుల్ గా ఉన్న హీరో(విజయ్) అక్కడే ఒక దీవిలో గ్యాంగ్‌స్టర్, స్మగ్లర్ గా పనిచేస్తున్న తన అన్న(సత్య దేవ్)ను కాపాడుకునేందుకు స్పై గా మారతాడు. ఇక విజయ్ దేవరకొండ స్పైగా మారిన తర్వాత ఎలాంటి పరిస్థితిలో ఎదుర్కొన్నాడు.. ఆ దివిలో ఉండే క్రూరమైన తెగ వాళ్లకు తాను ఎలా లీడర్గా మారాడు.. అనే కథతో సినిమా రన్ అయింది. సినిమా ప్రారంభం నుంచి విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో చూపించాడని.. రొటీన్ స్టోరీనే అయినా.. గౌతమ్ టేకింగ్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. స్టోరీ నరేషన్ స్లోగా ఉన్న.. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా హింట్స్ ఇవ్వకుండా.. గ్రిప్పింగ్ గా స్టోరీ నడిచిందని.. ఇంటర్వెల్ బ్యాంగ్ న్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ రైడ్ గా సాగిందట. అక్కడ దీవికి రాజుగా విజయ్ దేవరకొండ మారిన విధానం.. గూస్ బంప్స్ తెప్పిస్తుందని.. విజువల్స్ ఆద్యాంతం ఆకట్టుకుంటాయని.. రియలిస్టిక్‌గా సీన్స్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లోని కథకు, సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్‌కు కలెక్షన్ బాగా వర్కౌట్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలం తర్వాత.. తెలుగు సినిమా నుంచి మంచి స్టఫ్ వచ్చిందని.. పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. అనిరుధ్ మ్యూజిక్ ఎందుకంత స్పెషల్, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ప్రూవ్ అయిందని.. అంతలా సినిమాలు ఎలివేట్ చేశాడంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.
విజయ్ దేవరకొండ నుంచి ఈ రేంజ్ పర్ఫామెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరని.. ఫ్యాన్స్‌కే కాదు.. టాలీవుడ్ సినీ లవర్స్‌కు సైతం సినిమా అదిరిపోయే ట్రీట్ అంటూ తెలుస్తోంది. ఇక.. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు అయితే.. నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయట. సినిమా ప్రతి ఫ్రేమ్‌లో గౌతమ్ మేకింగ్ స్టైల్ కనబడుతుంది. ఆయన టాలెంట్ అర్థమవుతుందంటూ నెటిజన్స్ ట్విట్ చేస్తున్నారు. అయితే.. చాలా తక్కువ మంది నుంచి మాత్రం సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది. సినిమా బోరింగ్ గా ఉంది.. స్లోగా సాగుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే సినిమా కచ్చితంగా థియేటర్స్‌లో చూడాల్సిన కంటెంట్ అని తెలుస్తుంది. ఎట్టకేలకు కొండన్న ఏడేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టనున్నాడు అంటున్నారు.