తార‌క్ వార్ 2 వ‌ర్కౌట్ అయ్యితే తెలుగులో కూలీ ప‌రిస్థితి అదేనా..?

టాలీవుడ్ మాన్ అఫ్ మస్సెస్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ రూపొందుతున్న సినిమా వార్ 2. మరి కొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బ్యానర్ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ పై స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ వార్ 2 సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వార్ 2 మూవీతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా మెరవనుంది. హృతిక్ రోషన్ లీడ్ రోల్‌లో నటించనున్నాడు.

How can War 2 take on Coolie in this mode | cinejosh.com

ఆగస్టు 14న తెలుగుతోపాటు.. హిందీలోను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా రిలీజ్‌కు సన్నాహాలు పూర్తి చేశారు టీం. ఇక తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. సీతారా బ్యాన‌ర్‌లో హ్యాట్రిక్ లోడింగ్ అంటూ నాగ‌వంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పంచుకున్నాడు. అరవింద సమేత వీర రాఘవ, దేవర సినిమాలతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అభిమానులు.. వార్‌2తో అంతకుమించిన సక్సెస్ ఇస్తారని భావిస్తున్న అంటూ రాసుకొచ్చాడు. ఇక ఎప్పుడు థియేటర్ల‌ విషయంలో దూకుడుతో ప్రవర్తించే నాగవంసి ఈ సారీ కూడా భారీ సంఖ్యలో థియేటర్లను బుక్‌ చేసేసాడట‌. అయితే వార్ 2 రిలీజ్ రోజే.. రిలీజ్ కానున్న కూలి సినిమాకు ఇప్పుడు తక్కువ స్క్రీన్లు దక్కనున్నాయని సమాచారం.

Coolie: Rajinikanth's Upcoming Movie Release Date And Star CastCoolie: Rajinikanth's Upcoming Movie Release Date And Star Cast

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగ‌రాజన్‌ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియన్స్ను పలకరించనున్న‌ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆడియన్స్ లో సినిమాపై భారీ బజ్‌ నెలకొంది. కానీ.. వార్ 2తో పోలిస్తే కూలి సినిమాకు తెలుగులో హైప్‌ కాస్త తక్కువ అని చెప్పాలి. దానికి తగ్గట్టుగానే కూలి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్స్ కూడా తక్కువగానే ఉండనున్నయట. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకున్నా.. అదే వాస్తవం అని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఈ వార్తలు నిజమై.. వార్ 2 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో కూలి బ్రేక్ ఈవెన్ కావడం కష్టతరమవుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరి ముందు ముందు ఈ రెండు మూవీస్‌ విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వేచి చూడాలి.