టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాలకే పరిమితం కాకుండా.. తను సైన్ చేసిన సినిమాలను కూడా పూర్తి చేస్తున్నాడు. అలా.. తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన పవన్.. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. తాజాగా.. ఈ సినిమా పై సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్‌కు కొద్ది గంటల క్రితం అయిన ట్రైలర్తో చెక్ పడింది. ఇంతకీ.. ఈ భారీ సినిమా కోసం ఈ రేంజ్‌లో టైం తీసుకోవడంలో తప్పేమీ లేదంటూ ట్రైలర్‌ను చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కచ్చితంగా సినిమా పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక నిర్మాత ఏ.ఏం.రత్నం ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు బిజినెస్ చేయానని.. చెప్పేయడంతో బిజినెస్ లావాదేవీలు పూర్తికాలేదు. కారణం.. వాళ్లు డిమాండ్ చేస్తున్న రౌండ్ ఫిగర్ ఆసక్తి అనిపించకపోవడం. దీంతో ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీరే నా దగ్గరకు వచ్చి నేను అడిగినంత ఇస్తారని రత్నం ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయట. ఇక నైజం ప్రాంతంలో నిర్మాత రత్నం మొదటి నుంచి అక్కడ బయ్యర్స్‌ను రూ.65 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ.. మైత్రి మూవీ మేకర్స్ రూ.55 కోట్లు ఇచ్చేందుకు ఓకే చేసిందట.
మరో రెండు రోజుల్లో డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. అంతేకాదు.. ఈస్ట్ గోదావరి లో రూ.11 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయ్యినట్లు తెలుస్తుంది. కేవలం ఈ రెండు ప్రాంతాల నుంచి ఏకంగా రూ.66 కోట్ల బిజినెస్ జరిగిందట. ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వచ్చే సోమవారం పూర్తి చేయాలని నిర్మాత ఏ.ఏం.రత్నం భావిస్తున్నాడు. ఈనెల 10లోపు ఫస్ట్ కాపీని సిద్ధం చేసి సెన్సార్‌కు పంపి.. తర్వాత నుంచి ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించనునట్లు తెలుస్తుంది. నిన్న ట్రైలర్‌తో వచ్చిన జోష్‌తో థియేటర్ బిజినెస్‌లు కూడా.. భారీ లెవెల్లో జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.. ఏ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.