టాలీవుడ్ పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్.. ఏపీ డీపీటీసీగా మారిన తర్వాత వచ్చిన మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. నేడే సినిమా గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దాదాపు 5 భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా పై.. రిలీజ్ కి ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. బాబి డియోల్ పాత్రలో మెరిసిన ఈ సినిమాకు జ్యోతి కృష్ణ, క్రిష్ దర్శకులుగా వ్యవహరించారు. ఇక పవన్ నటించిన ఈ మొట్టమొదటి పిరియాడికల్ యాక్షన్ డ్రామ.. మెజారిటీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకోవడం విశేషం. ఇలాంటి క్రమంలో వీరముల్లుకు సంబంధించిన విషయం పవన్ ఫ్యాన్స్‌ను పూర్తిగా నిరాశపరిచిందని.. అదే విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక చాలా కాలం నుంచి పవన్ వర్సెస్ బన్నీ అభిమానుల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.
నిజానికి ఇద్దరు కెరీర్ మొదట్లో మెగా బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత ఇద్దరి మధ్య పలు వివాదాలు తలెత్తయి. ఈ క్రమంలోనే ఇప్పటికీ పవన్ వర్సెస్ అల్లుఅర్జున్ అభిమానుల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో పవన్ ఫ్యాన్స్ లో అంతలా డిసప్పాయింట్ చేసిన ఆ మ్యాటర్ ఏంటో.. బన్నీ ఫాన్స్ ఎందుకు అంత హ్యాపీనో ఒకసారి చూద్దాం. సాధారణంగా.. పవన్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. ఇతర హీరోల రికార్డు డేంజర్ లో పడిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అందులో భాగంగానే ఈసారి అల్లు అర్జున్ పేరిట ఉన్న రికార్డ్‌లన్ని పవన్ పటాపంచలు చేస్తారంటూ అభిమానులు ఎంతగానో ఆరాటపడ్డారు. కానీ పవన్ అభిమానులకు నిరాశ మిగిలింది. ఈ విషయంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ టాప్ ప్లేస్ లో ఉండగా.. ఆ రికార్డును పవన్ టచ్ చేయలేకపోయారు.
గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ఒకరోజు ముందు డిసెంబర్ 4న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే.. యూకే, యూఎస్ లాంటి ఓవర్సీస్ ప్రాంతాల్లో ఉన్న ప్రీమియర్ షోలను ముగించుకుంది. ఇండియా వైడైగా 640 పడగా.. కూ.14.40 కోట్ల కలెక్షన్లు పుష్ప దక్కించుకోగా.. అందులో 13.03 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు.. విదేశాల్లో పలు ప్రాంతాల్లో హరిహర వీరమల్లు సైతం ప్రిమియర్స్ ముగించుకుంది. అయితే.. ఇండియన్ వైడ్గా వీరమల్లు 737 షో లను ప్రదర్శించగా.. రూ.12.93 కోట్ల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. ఇందులో రూ.12.13 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రావడం విశేషం. అయితే.. వీరమల్లు రికార్డ్ లెవెల్లో అడ్వాన్స్ బుకింగ్ దక్కించుకున్నా.. పుష్ప 2 రికార్డ్‌ను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. దీంతో వీరమల్లు అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. బన్నీ అభిమానులు మాత్రం తమ రికార్డ్ సేఫ్‌గా ఉందంటూ తెగ సంబర పడిపోతున్నారు.