పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి వచ్చిన మొదటి మూవీ హరిహర వీరమల్లు. నీధీ అగర్వాల్ హీరోయిన్గా.. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకు.. జ్యోతి కృష్ణ దర్శకుడుగా వ్యవహరించగా.. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా పని చేశాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా రుపొందింది.ఇక ఈ మూవీ ప్రీమియర్ షోతోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇక జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం బాక్స్‌ఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతుంది.
ఇక కేవల్ పంరీమియర్స్‌తో మూవీ ఏకంగా రూ.30 కోట్ల వరకు కలెక్షన్లు కలగొట్టిందని పవన్ స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో సినిమా వివాదంలో చిక్కుకుందని.. పవన్ క్షమాపణాలు చెప్పాల్సిందేనంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఎన్నో అడ్డంకులు, అవరోధాలను ఎదుర్కొంది. ఇలాంటి క్రమంలో సరికొత్త చిక్కులను వీరమల్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలంటూ.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ డిమాండ్ చేశారు. అసలు ఇంతకీ వివాదానికి కారణం ఏంటో.. ఒకసారి చూద్దాం.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ మాట్లాడుతూ సినిమాలో చారిత్రక వాస్తవాలను వక్రీకరించి చూపించారని.. మండిపడ్డాడు. 1355లో వీరమల్లు మరణిస్తే 1591లో నిర్మించిన చార్మినార్ వద్ద ఆయన ఎలా యుద్ధం చేశాడు అంటూ ప్రశ్నలు సంధించడు. దీనిపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని కోరిన రామకృష్ణ.. కచ్చితంగా పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం నెటింట తెగ వైరల్ గా మారుతుంది.