“హరిహర వీరమల్లు ” ఫస్ట్ రివ్యూ.. పవన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కనా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత.. చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పటికే సైన్ చేసిన మూవీస్ మేకర్స్ కోసం మళ్లీ పవన్ మేకప్ వేసి హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేశాడు. ఆయన లేనప్పుడు మిగతా రెండు సినిమాల షూట్‌లు కూడా శ‌ర‌వేరంగా కంప్లీట్ చేసే పనిలో బిజీ అయ్యాడు. కాగా.. మరో రెండు రోజుల్లో వీరమల్లు సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా పై పవన్‌ అభిమానులతో పాటు.. సాధక‌ణ‌ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆయన కెరీర్‌లో వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఇక.. ఈ సినిమా రిలీజై.. థియేటర్స్ లో భారీ ఎత్తున బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక.. ఈ సినిమాను ఇప్పటికే నిర్మాత ఏ.ఏం. రత్నం పవన్ కళ్యాణ్‌తో పాటు.. ఆయన స్నేహితులు, అలాగే రాజకీయవేతలు, పారిశ్రామికవేత్తలు చాలామంది వీక్షించేసారని సమాచారం. సినిమా చూసిన తర్వాత వాళ్ళందరి అభిప్రాయాలు సినిమాపై పాజిటివ్‌గానే వినిపిస్తున్నాయి. వీరమల్లు మొదట 15 నిమిషాలకే అందరూ కథలో ఇన్వాల్వ్ అయిపోతారని.. 20 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందంటూ సమాచారం. అయితే.. సినిమాలో ఉండే ప్రేమ కథ, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని.. ఇంటర్వెల్ సిక్వెన్స్ వచ్చే ఫైట్ గూస్ బంప్స్‌ తెప్పించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ను మెప్పిస్తాయ‌ని.. ముఖ్యంగా క్లైమాక్స్ ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌కు తీసుకువస్తుందని.. పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు. మధ్యలో వచ్చే ఎన్నో ఎమోషన్ సీన్స్‌, పొలిటికల్, సాటారికల్, ధ‌ర్మానికి సంబంధించిన డైలాగ్స్ పవన్ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తాయని ఆడియన్స్‌కు పవన్ ఈసారి గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఎప్పటి వరకు సినిమాపై వచ్చిన రివ్యూలతో పవన్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రివ్యూల‌కు తగ్గట్టుగానే సినిమా రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో తో పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర పవన్ బీభత్సం ఖాయం అనడంలో సందేహం లేదు.