వీర‌మ‌ల్లు హిట్ అయినా వ‌సూళ్లు క‌ష్ట‌మేనా…!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. అంతేకాదు.. పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది. ఇక ఈ నెల 24న వీరమల్లు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్‌ టాక్ తెచ్చుకుంటే థియేటర్లు కళకళలాడతాయి. ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్‌కు ఉన్న కరువు తీరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజై ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకున్న క్రమంలో.. పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్‌లో సైతం సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో విజయ్ దేవరకొండ కింగ్‌డ‌మ్‌తో పవన్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది.

వీరమల్లు రిలీజ్ కు సరిగ్గా వారానికే కింగ్డమ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్‌. మరి పవన్ కళ్యాణ్ వీర‌మ‌ల్లుకు కు ఎంత హిట్ టాక్ వచ్చినా.. ఈ వారం రోజుల వ్యవధి సరిపోతుందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమా అంటే కనీసం రెండు వారాల వ్యవధి చాలా అవసరం. కానీ.. కింగ్‌డ‌మ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్తో వీర‌మ‌ల్లుకు అవకాశం లేకుండా పోయింది. సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర గట్టిగా నిలబడిన రెండో వారంలో కలెక్షన్లు రాబట్టాలంటే వీరమల్లుకు పోటీ ఉండకూడదు. ఫ్యామిలీ ఆడియన్స్ రెండో వారంలోనే ఎక్కువగా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటి సమయంలో కింగ్‌డ‌మ్‌ రిలీజ్ అయితే వీరమల్లుకు కష్టమవుతుంది.

Kingdom Movie Release Date And Star Cast

ఇక వీరమల్లు బడ్జెట్, బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నాడు రత్నం. అంత రిస్క్ చేసి భారీ బడ్జెట్ తో సినిమాను కొన్న బయ్యర్లకు డబ్బులు తిరిగి రావాలంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రెండో వారం కూడా సినిమా ఫుల్ ఆక్యుపెన్సీ దక్కించుకోవలసి ఉంది. లేదంటే.. సినిమాకు బిగ్‌ రిస్క్ అవుతుంది. ఇక ఇప్పటికే వేరే వాళ్ళు బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. అగ్రిమెంట్స్ జరగకున్న‌ రేటు కూడా బయర్లు ఫిక్స్ అయిపోయారని సమాచారం. ఇలాంటి క్రమంలో విజయ్ దేవరకొండ కింగ్‌డ‌మ్ సినిమా రిలీజ్ అవ్వడంతో వీరమల్లు మేకర్స్‌లో చిన్న ఆందోళన మొదలైంది. పవన్‌తో పోలిస్తే విజయ్ దేవరకొండ పెద్ద హీరో కాదు. కానీ.. తాజాగా రిలీజ్ అయిన కింగ్‌డ‌మ్‌ గ్లింప్స్‌తో ఈ సినిమా పై సైతం ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. ఈ క్రమంలోనే వీరమల్లు రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్నా.. కచ్చితంగా కింగ్డమ్ ప్రభావం సినిమా పై పడే అవకాశం ఉంది. మరి.. వీరమల్లు స్పీడ్ కు కింగ్‌డ‌మ్ రేకులు వేస్తుందా.. లేదా పవన్ ప్రభంజనం ముందు.. విజ‌య్ మూవీ కొట్టుకుపోతుందా వేచి చూడాలి.