టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాస్ తాజాగా తన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వీలక్షణ నటుడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ఆయన తన చివరి క్షఫాల వరకు ఇండస్ట్రీలో రాణించాడు. రోజుకు 20 గంటల సమయం నటనకే కేటాయించేవారు. ఏడాదిలో దాదాపు 30 సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఆయన.. అలా సినీ కెరీర్లో కోట్ల ఆస్తులను సైతం కూడబెట్టాడు. కాగా ఆయన అకాల మరణం ఇండస్ట్రీని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆయనతో కలిసి పని చేసిన ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్.. ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెడుతున్నారు. ఇక కోట శ్రీనివాస్ చివరి సినిమా ఏంటి.. ఆ సినిమా హీరో ఎవరనే.. ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
అయితే.. కోట శ్రీనివాస్ చివరి సినిమా మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఆ మూవీ మరేదో కాదు హరిహర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా.. జులై 24న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే.. సినిమా దర్శకుడుగా మొదట్లో క్రిష్ వ్యవహరిఆంచగా.. ఆయన డైరెక్షన్లోనే కోట కూడా ఈ సినిమాలో నటించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. క్రిష్ గారు చాలా మంచి దర్శకుడు. ఆయన పిలిచి మూడు రోజులు షూటింగ్ ఉండే పాత్ర ఉందన్నారని.. దానికి వెంటనే నేను ఒప్పుకుని నటించాను అంటూ కోట క్లారిటీ ఇచ్చారు. ఎడిటింగ్ లో ఎలాంటి సన్నివేశాలు తీయకుండా ఉంటే తప్ప కోట శ్రీనివాస నటించిన చివరి సినిమా హరిహర వీరమల్లు అవుతుందనటంలో అతిశయోక్తి లేదు. ఇక ఇదే ఇంటర్వ్యూలో కోట.. పవన్ కళ్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాను కూడా ఆడియన్స్ గుర్తు చేసుకుంటున్నారు. సినిమాలో కోట.. మందు బాబులం సాంగ్ కూడా పాడాడు. ఈ సాంగ్ ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే.. ఈ సాంగ్ ఎందుకు పాడాడో చెప్తూ కోట ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి అప్పటికే పాటను పాడేసారని.. ఒక రోజు నన్ను డైరెక్టర్ హరీష్ శంకర్ స్టూడియోకి రమ్మన్నారని.. డబ్బింగ్ ఏదైనా బ్యాలెన్స్ ఉందేమో అని వెళ్ళా.. అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బింగ్ కాదు ఓ పాట పాడాలన్నారు. అక్కడ డిఎస్పి కూడా ఉన్నారు. సార్ నేను ఈ పాట పాడితే.. మీ స్క్రీన్ ప్రజెన్స్‌కి మ్యాచ్ కావడం లేదు. మీది పెద్ద వయసు కనుక నేను పాడుతుంటే చిన్న పిల్లాడు పాడినట్టు ఉంది. అందుకే మీరు పాడితేనే మీ బాడీ లాంగ్వేజ్‌కి స్క్రీన్ ప్రజెన్స్‌కి మ్యాచ్ అవుతుందని డిఎస్పి అన్నాడు. సరదాగా పాడేయండి అని చెప్పారు. ఆ స్టూడియోలోనే కీరవాణి కూడా ఉన్నారని.. ఆయనకు సాంగ్ గురించి తెలిసి నన్ను అభినందించారు. అయితే ఈ పాట డిఎస్పీ పాడి ఉంటే సింగర్ పాడినట్లు ఉండేది. మీరు పాడారు కనుక నిజంగా తాగుబోతు పాడినట్లు ఉంటుంది. మంచి పని చేశారంటూ కీరవాణి అన్నారని.. కోట గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.