సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కాలంలోనే ఈ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కి మంచి ఆదరణ పొందేవి. అలాంటి మల్టీ స్టారర్ సినిమాలు తర్వాత మెల్ల మెల్లగా తగ్గిపోయినా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో మళ్లీ మల్టీ స్టారర్‌ల సందడి మొదలైంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టారర్‌ల హవా కొనసాగుతుంది.
స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి క్రమంలోనే.. గతంలో నాగ్ – తారక్ కాంబోలో ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మిస్ అయిందంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. అయితే.. ఈ కథలో తారక్ తన క్యారెక్టరైజేషన్ నచ్చకపోవడంతో తానే స్వయంగా సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇక ఈ సినిమాలో నాగార్జున మాత్రం నటించారు. ఇంతకీ ఆ మూవీ ఏంటో చెప్పలేదు కదా.. అదే ఊపిరి. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా, కార్తీ సెకండ్ హీరోగా మెరిసిన ఈ సినిమాలో తమన్న, శ్రేయ హీరోయిన్లుగా నటించి మెప్పించారు.
అంతేకాదు.. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక.. వంశీ పైడిపల్లి మొదట ఈ సినిమాలో కార్తీ రోల్ కోసం ఎన్టీఆర్‌ను భావించాడట. కానీ.. తారక్ క్యారెట్రైజేషన్ తనకు సెట్ కాదంటూ.. కథను రిజెక్ట్ చేసాడు. తర్వాత ఆ పాత్ర కోసం ఎంతోమంది హీరోలను చూసిన ఫైనల్ గా కార్తీ అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాకు తన పాత్రలో కార్తీ జీవించేసాడు. అంతేకాదు సినిమా షూట్ టైంలో నాగార్జున, కార్తీ సొంత బ్రదర్స్ కన్నా ఎక్కువగా దగ్గరయ్యారు. అలా.. నాగార్జున – తారక్ కాంబోలో రావాల్సిన ఓ హిట్ సినిమా మిస్ అయిపోయింది.