మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూట్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరు కాంబో వస్తున్న తొలి మూవీ కావడంతో.. ఆడియన్స్‌లో మొదటి నుంచి సినిమాపై అంచనాలు భారీ లెవెల్‌లో మొదలయ్యాయి. పటాస్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన అనిల్.. సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక తన ప్రతి సినిమాలో వినోదం, కామెడీ సీన్స్ కచ్చితంగా హైలైట్ అయ్యేలా చూసుకుంటాడు అనిల్.
ఇక.. మెగాస్టార్ పర్‌ఫెక్ట్ కామెడీ టైమింగ్‌కు కేరాఫ్ అడ్రస్. దీంతో ఈ సినిమాను సైతం అనిల్ రావిపూడి.. చిరు కామెడీ మార్క్ టచ్ చేస్తూ తనదైన స్టైల్ లో హైలైట్ చేసేలా రూపొందిస్తున్నాడట. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు, నయన్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏవో ఒక లిటిల్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అలా.. తాజాగా సినిమాలో చిరు, నయన్ పాత్రలు లీక్ అయ్యాయి. మూవీలో చిరంజీవి డ్రిల్ మాస్టర్గా మెరవనున్నాడని.. నయనతార టీచర్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.
వీళ్ళిద్దరి మధ్య ఫన్ రొమాంటిక్ సీన్స్ హైలెట్గా కానున్నాయట. చిరంజీవికి డ్రిల్ మాస్టర్ రోల్‌పై అభిమానుల సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరు సినిమాకు అనిల్ మార్క్ క్రేజీ టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది, మెగా 157 మూవీకి.. మన శంకరా వరప్రసాద్ గారు.. అనే టైటిల్ సెలెక్ట్ చేశారట. ఇక చిరంజీవి అసలు నేమ్ శివశంకర వరప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒరిజినల్ నేమ్ ను టైటిల్ గా పెడుతూ సినిమాను రూపొందిస్తున్న క్రమంలో.. సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది. ఇక.. చిరు రోల్, మూవీ టైటిల్ సెలక్షన్లో అనిల్ తన మార్క్ చూపిస్తున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్, షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిద్దల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.