బ్రహ్మానందం ఫన్నీ కామెంట్స్.. పవన్ నవ్వు ఆపుకోలేకపోయాడు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ తర్కెక్కనున్న లేటెస్ట్ పిరియాడిక్ హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. కృష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్యవహరించగా.. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్గా చేసాడు. ఈనెల 24న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోర్ పెంచారు. అలా.. తాజాగా శిల్పకళా వేదికలో ఫ్రీ రిలీజ్డ్ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ బ్రహ్మానందం ఆయన పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు పవన్ గురించి మాట్లాడుతునే ప‌వ‌న్ చేసిన పలు ఫన్నీ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. మానవత్వం పరిమళించిన మంచిమ‌నిషి పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు. ఆయనను ఎప్ప‌టినుంచో చూస్తున్నా.. సమాజానికి ఉపయోగపడేలా ఇంకా ఏదో చేయాలని తపన ఎప్పటికప్పుడు ఆయనలో కనిపిస్తూనే ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా తను వేసుకున్న బాటలో తాను నడిచాడు తప్ప.. ఎవరి దారిలోనూ ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన బాటలోనే మరో పదిమంది నడిచేలా ఆయన నడవడిక ఉంది. తనను తాను చెక్కుకున్న శిల్పి పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఆయన కావాలని నటుడు కాలేదు.. నువ్వు సినీ నటుడు కావాలి అని చిరంజీవి దంపతులు ప్రోత్సహించడంతో మొదటిసారిగా.. అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. సినిమాలో నటించాడంటూ చెప్పుకొచ్చాడు.

నటనతో ఆగలేదు రాజకీయాలను రాణిస్తున్నాడు. అది ఆయన కోరుకున్నది కాదు విధి అలా నడిపించింది. లేచిన కెరటం గొప్పది కాదు. పడి లేచిన కెరటం ఎంతో గొప్పది.. ఎంతో మంది ఎన్ని అనుకున్న.. సముద్రం వచ్చి మీద పడిన జంకకుండా ఉండగలిగే ఏకైక వ్యక్తి పవన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా గురించి ప‌వ‌న్ న‌ట‌న గురించి ప్ర‌సంసించిన ప‌వ‌న్‌.. ఆయ‌న సినిమాల్లో డ్రెస్సింగ్ స్టైల్‌ను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ అందరినీ నవ్వించాయి. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఏది వేసిన అదో ట్రెండ్ అంటూ ఆయ‌న ఏం అన్న అదో ట్రెండ్ అంటూ చెప్పుకొచ్చాడు. మీ ఒడిలో తల పెట్టుకుని ఎప్ప‌టికైనా వెక్కి వెక్కి ఏడవాలని ఉంది అని బ్రహ్మానందం చేసిన కామెంట్స్ పవన్‌ను కడుపుబ్బా నవ్వించాయి.