వీర‌మ‌ల్లును బాయ్‌కాట్ చేసుకోండి.. నా సినిమా మిమ్మల్ని అంత భయపెట్టిందా.. పవన్ హాట్ కామెంట్స్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరమల్లు సినిమా సక్సెస్ మీట్‌ను గురువారం (జులై 24) సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు.. నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతి కృష్ణ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో సక్సెస్ మీట్‌కు హాజరవడం ఇదే మొదటిసారి అంటూ చెప్పుకొచ్చాడు. తన సినిమాలను ప్రమోట్ చేసే అలవాటు కూడా త‌న‌కు లేదని వివరించాడు. విరమ‌ల్లు సినిమా ప్రమోషన్స్‌లో గత రెండు రోజుల్లో నేను మాట్లాడిన విషయాలు.. నా 29 ఏళ్ల సినీ కెరీర్‌లో పది శాతం కూడా మాట్లాడి ఉండను.

పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీలు ఎన్నో చేశా. కానీ.. నా సినిమా విషయంలో కూడా పంచాయతీ చేసే రిలీజ్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అదే ఇప్పుడు జరిగిందంటూ ఆసక్తికర కామెంట్ చేశాడు. డిప్యూటీ సీఎంనే కదా సినిమా సులువుగానే రిలీజ్ అవుతుంది అనుకున్నా. కానీ.. వీరమల్ల సినిమా రిలీజ్ కోసం ఎన్నో పంచాయతీలు చేయాల్సి వచ్చింది. వారం రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా పోలేదంటూ హాట్ కామెంట్స్ చేసిన పవన్.. తన లైఫ్‌లో ఇప్పటివరకు ఏది సులువుగా దొరకలేదని.. ఏదీ వడ్డించిన విస్తరి కాదంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా అందరికీ నచ్చడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.

వీరమల్లు పార్ట్ 2 షూట్ కూడా 25 నుంచి 30% వరకు పూర్తయిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే పూర్తి షూట్ కంప్లీట్ చేసి దాన్ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తామంటూ పవన్ వివరించాడు. ఇక ఈ ఈవెంట్‌లోనే పవన్ మాట్లాడుతూ సినిమాను బాయ్‌కాట్ చేస్తామని ఎంతోమంది బెదిరించారు.. కానీ ఎక్కడ బెదర్లేదంటూ పవన్ చెప్పుకొచ్చాడు. నా సినిమా మిమ్మల్ని అంతగా భయపెట్టిందా అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. కాగా.. ఎన్నో అడ్డంకులు నిరీక్షణలో దాటుకుని హరిహర వీరమల్లు స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్ రిలీజ్ అయింది. అసలు సినిమా పూర్తి కాదని భావించే క్రమంలో పవన్ సినిమా షూట్‌ కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. హిస్టోరికల్ పిరియాడిక్ మూవీగా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.