పాన్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. తమిళ్లో పాపులర్ సినీ ప్రొడక్షన్ బ్యానర్స్ సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, కోలీవుడ్ నటుడు సత్యరాజ్, సౌబిన్ షాహిద్, రెభా మౌనిక, పూజా హెగ్డే, బాలీవుడ హీరో అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. సినిమా కాస్టింగ్, టెక్నికల్ పరంగా చాలా రిచ్ గా రూపొందించారు. ఇక ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను.. సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, ప్రాజెక్ట్ ప్రమోషన్ ఖర్చులు.. దాదాపు అన్నింటిని కలుపుకొని రూ.350 కోట్ల పైచిలుకే బడ్జెట్ అవుతుందని సమాచారం.
ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు.. అదే లెవెల్లో ఏరియా వైడ్‌గా గ్రాండ్ బిజినెస్ జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి క్రమంలో సింగపూర్లో సినిమాకు భారీ దెబ్బ పడే అవకాశం ఉందని.. అక్కడ ఇంకా సినిమా బిజినెస్ చర్చల దశలోనే ఉందంటూ.. ఓ సమస్య వల్ల కలక్షన్ల పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రజిని సినిమాకు బిజినెస్ కష్టాలు వచ్చాయంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకీ సినిమాకు సింగపూర్లో ఎదురైనా కష్టమేంటంటే..సింగపూర్‌లోనే అతిపెద్ద సినిమా.. చైనా థియేటర్స్.. కాథే సినిమా ఫ్లెక్సస్ సంస్థ తన సినిమా హాళ్ళను మూసి వేయడమే.
కూలీ సినిమా రిలీజ్ విషయంలో ఇది భారీ షాక్ అనే చెప్పాలి. ఇక థియేటర్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. బిజినెస్ వ్యవహారంలో కూడా చాలా వరకు కోతపడుతుందని.. డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. నిజానికి సినిమా ధియేటర్ రైట్స్ రూ.4.5కోట్లు కాగా.. భారీ సంఖ్యలో థియేటర్లు తగిన క్రమంలో రూ.4 కొట్లు తగ్గించాలని డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారట. మరి ఇంతలా కోత అంటే కష్టమని మేకర్స్.. బిజినెస్ విషయంలో ఆలోచనలు చేస్తున్నారట. అయితే తాజాగా ఈ సినిమా బిజినెస్ రూమర్లపై సింగపూర్ మూవీ డిస్ట్రిబ్యూటర్లు క్లారిటీ ఇచ్చారు. సినిమా హక్కులు ఇంకా ఎవరికీ దక్కలేదు.. సింగపూర్లో హంసని ఎంటర్టైన్మెంట్ ఈ హక్కులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంది. సినిమాకు భారీ రిలీజ్ ప్లాన్ జరుగుతుంది.. దానికి సంబంధించిన విషయాలు అఫీషియల్ గా మేమే క్లారిటీ ఇస్తామంటూ డిస్ట్రిబ్యూటర్లు సోషల్ మీడియా వేదికగా వివరించారు.