నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా నాలుగు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ సినిమాలలో నటిస్తూ హిట్ పై హిట్ కొడుతున్న బాలయ్య.. అఖండ నుంచి చివరిగా వచ్చిన డాకు మహారాజ్ వరకు వరుస సినిమాలతో సక్సెస్‌లు అడ్డుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 సినిమాలో బిజీబిజీగా గడుపుతున్న బాలయ్య.. అభిమానులను ఆశ్చర్యపరిచేలా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఇటీవల తాజాగా.. ఈ నగరానికి ఏమైంది 2 మూవీని అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో రూపొందనున్న ఈ మూవీ.. 2018లో వచ్చిన యూత్ ఫుల్ మూవీ ఈ నగరానికి ఏమైంది.. సూపర్ డూపర్ హిట్ కు సీక్వెలఖగా రూపొందుతుంది. మొదటి భాగంలో కనిపించిన అదే నటీనటులతో.. ఈ నగరానికి ఏమైంది 2 రూపొందించాలని ఫిక్స్ చేశారు. యూత్ ఫుల్ కామెడీ ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్‌లో సాగనున్న ఈ మూవీ గెస్ట్ రోల్ కోసం బాలయ్య సుమారు 15 నిమిషాల పాటు కనిపించడున్నాడని టాక్. ఆయన పాత్ర పూర్తిగా కామెడీ కోణంలో ఉండనుందని తెలుస్తుంది. బాలయ్య గత కొప్పి సంవత్సరాలుగా చాలా పవర్ఫుల్, మాస్, గంబ్బిరమైన రోల్స్‌లో నటిస్తూ ఆకట్టుకుంటున సంగతి తెలిసిందే.
అలాంటి బాలయ్య.. ఒక కామెడీ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్.. అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఇక ఈ సినిమాల్లో అలాంటి పాత్ర కోసం బాలయ్యను తీసుకోవడానికి ప్రధాన కారణం విశ్వక్ సేన్ అట. విశ్వ క్ అంటే బాలయ్యకు అభిమానం. ఈ క్రమంలోనే.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో కలిసి బాలకృష్ణతో అప్రోచ్ కావడంతో.. విశ్వక్, బాలయ్య మధ్య ఉన్న రిలేషన్‌తో బాలయ్య ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే వాస్తవం అయితే.. ఈ నగరానికి ఏమైంది 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంటుంది.