ఏడాదికి 30 సినిమాలు.. లక్షల్లో రెమ్యూనరేషన్.. కోట ఆస్తుల విలువ తెలుసా.. వారసులు ఎవరంటే..?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కోటా శ్రీనివాస్‌.. తన సినీ ప్రస్థానంలో దాదాపు 750 కి పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. విలక్షణ పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఊహించిన విధంగా వేలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఆయన ఏడాదికి 30 సినిమాల్లో నటిస్తూ.. రోజుకు 20 గంటలు పనిచేసేవారు. ఈ క్రమంలోనే లక్షల్లో రెమ్యునరేషన్ పుచ్చుకున్న కోటా.. కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. ఇక ఇటీవల తన 83వ పుట్టినరోజును పూర్తి చేసుకున్న కోట మూడు రోజుల వ్యవధిలోనే తుదిశ్వాస విడ‌వ‌డం విషాదాన్ని నింపింది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు.. రాజకీయ నాయకుల సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి క్ర‌మంలో ఆయన ఆస్తుల విలువ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది.

కోట తన సినిమాలకు రోజుకు.. కొన్ని గంటలకు లక్షన్నర కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోలేదని స్వయంగా వివరించాడు. పెద్ద సినిమాలకు మొత్తం రూ.25 లక్షల వరకు తీసుకునే వారిని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇక బిజెపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఎలక్షన్స్ అప్పుడు ఆయన తన ఆస్తుల విలువ 10 లక్షలని అఫిడ‌విట్‌లో క్లియర్గా వెల్లడించాడు. బిజెపి ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించిన కోట.. తర్వాత రాజకీయాలకు దూరమయ్యాడు. సినిమాల్లో మళ్ళీ బిజీ అయిన ఆయన.. హైదరాబాద్ ఫిలింనగర్ లో తన నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

Veteran actor Kota Srinivasa Rao says 'I am healthy' as he dismisses his  death rumours - India Today

శ్రీనివాసం పేరుతో ఉన్న ఆ ఇంటి మార్కెట్ విలువ ప్రస్తుతం కోట్లల్లో ఉంది. అలానే.. ఆయన కెరీర్‌లో బిజీగా ఉండే కాలంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి భారీ ఆస్తులనే కూడబెట్టుకున్నాడు. దాదాపు రూ.80 కోట్లకు పైనే ఆస్తుల విలువ ఉంటుందని సమాచారం. ఇక ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న కోట శ్రీనివాస్ ఎన్నో వివాదాల్లోని చిక్కుకున్నాడు. ఎన్నో కష్టాలను చూశారు, తన నటన జీవితంలో ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. కేంద్రం పద్మశ్రీతో సైతం ఆయనను సత్కరించింది. ఇక వారసుల విషయానికి వస్తే కోట కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకు పెళ్ళిళ్లై పిల్లలతో లైఫ్ లీడ్‌ చేస్తున్నారు. వారసులుగా కోట ఆస్తి వాళ్ల‌కు దక్కనుందట.