ఒరిజినల్ కంటే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన చిరు రీమేక్ సినిమాల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూనే హీరోగా అవకాశాన్ని దక్కించుకొని తన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్ బ‌స్టర్ హీట్‌లు తన ఖాతాలో వేసుకున్న చిరు.. ఐదు దశాబ్దాలుగా తిరుగులేని క్రూఏజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1గా రాణిస్తున్న చిరు తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక రిజల్ట్ తో సంబంధం లేకుండా నిర్మాతలకు ఎక్కువ లాభం తెచ్చిపెట్టిన సినిమాలు సైతం చాలానే ఉన్నాయి. కాగా చిరు కెరీర్‌లో డైరెక్ట్ సినిమాలతో ఎలా అయితే హిట్ కొట్టాడో.. సూపర్ హిట్, ఇండ‌స్ట్రియల్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.

Hitler (1997) - IMDb

అలానే.. కొన్ని రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించాయి. హిట్లర్ సినిమాతో మొదలుకొని ఘరానా మొగుడు, గాడ్ ఫాదర్ సహా చాలా రీమేక్‌ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒరిజినల్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేశాయి. అలా.. చిరంజీవి నటించిన రీమేక్‌తో హైయెస్ట్ కలెక్షన్‌లు కొల్లగొట్టిన సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం. హిట్లర్ మూవీ మలయాళ సినిమా కలెక్షన్లు రూ.10 కోట్లు కాగా.. తెలుగులో రూ.15 +10 కోట్లు.. రూ.25 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను కొల్లగొట్టింది. పువ్వుల్‌ పుదీయా పుంతెనల్.. రూ.4 కోట్ల వ‌ర‌కు కలెక్షన్ కొల్లగొట్టగా.. తెలుగులో ఈ సినిమా పసివాడి ప్రాణం టైటిల్ తో రీమేక్ అయ్యి రూ.5 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.

Gharana Mogudu (1992) | Cinema Chaat

అలాగే అమ్మన్‌కోవిల్.. కిజీకాల్ రూ.3 కోట్ల వసూళ్లు చేయగా.. రీమేక్ ఖైదీ నెంబర్ 786 రూ.5కోట్ల వసూళ్లు దక్కించుకుంది. అనురాగ అరలీపు రూ.5 నుంచి 6 కోట్లు వసూళ్లు చేయగా.. ఘరానా మొగుడు రూ.10 కోట్లను మించి వసూళ్లను దక్కించుకుంది. రమణ రూ.15 కోట్ల వసూళ్లు చేయగా.. ఈ సినిమాకు రీమేక్ ఠాగూర్ రూ.28 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇక కార్తీ రూ.30 కోట్ల కలెక్షన్ రాగా.. తెలుగులో ఖైదీ నెంబర్ 150 రూ.165+కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఇక లూసిఫర్ రూ.30 కోట్ల దక్కించుకోగా గాడ్ ఫాదర్ రూ.108 కోట్ల వ‌సూళ్లు సొంతం చేసుకుంది.

Khaidi No. 150 (2017) - IMDb