టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్‌తో కొత్త స్టోరీ ఆశించకూడదని డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చేశాడు. చాలా వరకు హారర్ సినిమాలలోనే ఒక పాడుబడిన రాజ్ బంగ్లా.. అందులో తరతరాలుగా తిష్ట వేసుకుని ఉన్న రాజు గారి ఆత్మ.. ఇక హౌస్‌లో హీరో ఎంట్రీ తర్వాత పడే కష్టాలు.. అతని గ్యాంగ్ అవస్థలు.. ఇదే రాజ్యసభ స్టోరీ కూడా అనిపిస్తుంది. కానీ.. టేకింగ్ మేకింగ్‌లో మాత్రం మారుతీ తన స్టైల్ ను చూపించాడు. నవ్వుతూ, భయపడుతూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడని అనిపిస్తుంది.
ఇక పోస్టర్లో రిలీజ్ చేసిన రెండు గెటప్లలో.. ఒక్కరోజు మాత్రమే టీజర్ లో చూపించి.. రెండో రోజు సర్ప్రైజ్ కోసం చూపించకుండా దాచి పెట్టారని తెలుస్తోంది. టీజర్‌తో మాస్ బ్యాంగ్ చూపించిన మారుతి.. హీరోయిన్ నిధి అగర్వాల్, మాళవిక మోహన్‌ల గ్లామర్ డోస్ సైతం పరిచయం చేశాడు. అయితే.. రిద్ది కపూర్‌ని మాత్రం కేవలం ఒకే షాట్‌లో చూపించాడు. సంజయ్ దత్ దెయ్యంగా మారే రాజుగా కనిపించనున్నాడు. సప్తగిరి, వేణు వి గణేష్, సముద్రఖని తదితరులు ఈ సినిమాల్లో కీలక పాత్రలో మెరవనున్నారు.
ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ యవర్ ఇండియన్ సినిమా అంటూ టీజర్ లో గ్రాండ్ గా అనౌన్స్ చేసాడు మారుతి. థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్‌కు బాగా సెట్ అయింది. అయితే.. టీజర్‌లో కనిపించిన ఒకే ఒక్క మైనస్ ప్రభాస్ లుక్స్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాహుబలి, సాహు వరకు టాలీవుడ్ హీరోలలో ఉన్న ఏకైక హాలీవుడ్ కటౌట్ ప్రభాస్‌ది. అయితే.. తర్వాత ప్రభాస్ లుక్స్ లో మెల్ల మెల్లగా తేడా వచ్చేసింది. రాదే శ్యామ్‌లో కెమెరా వర్క్, ఫ్రేమ్స్ అద్భుతంగా ఉన్న ప్రభాస్ కళ్ళలో ఆరా మిస్ అయింది.