టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుకుని.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి కష్టపడుతున్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు.. ప్రతి ఒక్కరు తమ సినిమాలతో ఆడియన్స్‌ని మెప్పించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వరుస సినిమాల లైనప్‌తో ఫ్రీ ప్లాన్డ్ గా రాణిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న హీరోలలో మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఆయన మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు, స్టార్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతం తారక్.. హిందీ వార్ 2తో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమా షూట్‌లో బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. వార్ 2.. ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ప్రశాంత్ నీల్.. డ్రాగన్ వచ్చేయడాది జూన్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో రెండు సినిమాల పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్న తారక్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ పై తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక ఆ బ్యానర్ మరేదో కాదు.. సూర్యదేవర నాగవంశీ అదినేతగా వ్యవహరిస్తున్న.. సితార ఎంటర్టైన్మెంట్స్ అట.
ఇప్పటికే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో సినిమా వస్తుందంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తారక్ సైతం అది వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ కాంబోలో నాగవంశీనే ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నాడట. అంతేకాదు.. తారక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మరో సినిమా నటించనున్నాడని.. నాగ వంశీ నుంచి తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు కూడా ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించినన్నారు. ఇలా.. తారక్ హీరోగా వార్ 2.. ప్రశాంత్ నీల్ డ్రాగన్‌లతో పాటు.. త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్లతో లైన్ అప్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తారక్.. ఫ్యూచర్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని.. ఇంకా చాలామంది స్టార్ట్ డైరెక్టర్లతో సినిమాలు నటించాలంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.