టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం.. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. మరోసారి బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరూ కాంబోలో తెరకెక్కిన మూడు సినిమాలు ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడం.. అది కూడా అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
దానికి తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన రోజుకో వార్త నెటింట వైరల్ గా మారుతుంది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య కోసం బోయపాటి అదిరిపోయే ప్లాన్ వేసాడట. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్లో ఈ సినిమా షూట్ ప్రారంభమవుతుందని.. సాంగ్ షూట్ పూర్తయిన తర్వాత బాలయ్య షాట్స్.. ఈ సాంగ్‌లో యాడ్ చేయనున్నట్లు సమాచారం. ఇక 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై.. రామ అచ్చంట, గోపి ఆచ్చంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఎస్. ఎస్. థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సంచలనం సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు టీం. ఈ సినిమాల్లో గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా మెరవనుంది. యంగ్ హీరో ఆది పిన్నిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖండ 2 తాండవం కోసం బాలయ్య అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మూవీ రిలీజ్ అయ్యిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.