టాలీవుడ్ మెగా పవర్ స్టార్‌గా రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరోపక్క టాలీవుడ్ పవర్ స్టార్.. ఎపి డిప్యూటీ సీఎం గా.. పవన్ కళ్యాణ్ తన సత్తా చాటుకుంటూ రాణిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల ఎవరికి లేని రేంజ్‌లో సపరేట్ ఫ్యాన్ వెస్ పవన్ కళ్యాణ్ సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి క్రమంలోనే.. వీళ్ళిద్దరికీ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. పవన్ కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుందట. అయితే.. ఈ ఇద్దరూ సినిమాల్లో కలిసి నటిస్తున్నారు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కలిసినట్టే. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో చరణ్ హీరోగా.. పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా తెరకెక్కనుందట.
మొదటినుంచి పవన్‌కు సినిమాల్లో నటనతో పాటు.. రచన, దర్శకత్వంపై కూడా ఇష్టం ఉండదట. అలాగే.. సినిమాలను ప్రొడ్యూస్ చేయడం కూడా ఆయనకు చాలా ఇష్టం. కానీ.. ఆ రంగాల్లో ఆయన చురుగ్గా ముందడుగు వేయలేకపోయారు. ఆయన చేసిన ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ తన బ్యానర్ పై పవన్.. చరణ్‌ను హీరోగా పెట్టి.. ఓ సినిమాను ప్రెజంట్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ క్లోజ్ ఫ్రండ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో.. హారిక హాసిని బ్యానర్, పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాయని సమాచారం. అయితే ఇప్పటికే చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ తన క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నాడంటూ వార్తలు ఎన్నోసార్లు వైరల్ అయ్యాయి. కానీ.. ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు.
అయితే.. బాబాయ్ ప్రొడ్యూస్ చేయబోయే ఈ అబ్బాయి సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తే.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయ్ అనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటికే త్రివిక్రమ్ భార్య హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా.. వెంకటేష్‌తో సినిమాను రూపొందించిన తర్వాత.. చరణ్‌తో మరొకటి, ఎన్టీఆర్‌తో ఇంకొకటి.. ఇలా వరుస సినిమాల లైనప్ సిద్ధం చేసుకున్నారు. వీటిలో వెంకటేష్‌ది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కాగా.. చరణ్ మాసే ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ, ఎన్టీఆర్ మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలో నటించనున్నారని తెలుస్తుంది. ఇప్పుడు మూడు ప్రాజెక్టులలో బాబాయి, అబ్బాయి కాంబోలో రాబోతున్న ఈ సినిమా పైనే.. ఆడియన్స్ అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఇందులో వాస్తవం ఏంటో తెలియాలంటే సరైన స్పష్టత వచ్చేవరకు వేచి చూడాల్సిందే.