కన్నప్ప పైనే ఆశలు పెట్టుకున్న మంచు విష్ణు.. ఆడకపోతే ఎంత నష్టమంటే..?

టాలీవుడ్ మంచు విష్ణు హీరోగా నటించిన తాజా మూవీ కన్నప్ప. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను.. మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక సినిమా అనౌన్స్మెంట్ నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పినిమా నుంచి రిలీజైన‌ ప్రోమో సైతం విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది. మంచు విష్ణు శివయ్య అని చెప్పిన డైలాగ్‌ను.. సింగిల్ మూవీలో శ్రీ విష్ణు స్కుఫ్‌ చేయడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈ క్రమంలోనే.. ఆ ప‌దం తీసేసి మరో పదాన్ని సింగిల్ సినిమాలో రీప్లేస్ చేశారు.

అంతేకాదు.. తాజాగా మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ ట్రైలర్ రిలీజ్ లోను మనోజ్ సైతం శివయ్య అని పిలిస్తే శివుడు రాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వివాదాలకు కూడా నెలవుగా నిలిచింది. హార్డ్‌డిస్క్ పోయిందంటూ వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా.. బ్రాహ్మణ సంఘం ఈ సినిమాపై మండిపడింది. ఇలాంటి క్రమంలో సినిమా పైనే మంచు విష్ణు పూర్తి ఆశలన్నీ పెట్టుకున్నారు. కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యి కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాతో ఉన్నాడు. అలా ఓటీటీ డీల్ ర‌ద్దు చేశానని.. హిట్ అయ్యాక ఇస్తామన్న ఫిగర్ కి డీల్ క్లోజ్ చేసామని వివరించాడు. ఒకవేళ హిట్ కాకపోతే ముందుగా ఇస్తా అన్న అమౌంట్ కూడా కన్నప్పకు అందదు.

Vishnu Manchu's big budget film 'Kannappa's teaser to launch at Cannes Film Festival

అయినా.. అంత రిస్క్ చేశాడంటే విష్ణుకు క‌న్నప్ప పై ఉన్న నమ్మకం ఏంటో అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత అని అడగగా.. పర్ఫెక్ట్ ఫిగర్ చెప్పకున్నా త్రీ నెంబర్ ఫిగ‌ర్‌ అని క్లారిటీ ఇచ్చాడు. రూ.100 కోట్లే కదా త్రీ నంబర్ ఫిగ‌ర్‌ అని యాంకర్ అడగ‌గా.. అంతకంటే చాలా ఎక్కువ అయింది. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెబితే మా పై ఐటి దాడులు జరుగుతాయి అంటూ చెప్పుకొచ్చాడు. అంటే కన్నప్ప బడ్జెట్ రూ.200 నుంచి 300 కోట్ల వరకు జరిగిందని విష్ణు చెప్పకనే చెప్పేసాడు. ఈ క్రమంలోనే జూన్ 13న గ్రాండ్ లెవెల్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే సరే సరి. లేదంటే మాత్రం.. విష్ణు కెరీర్‌లోనే ఇది కోలుకోలేని దెబ్బవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండనుంది.. అసలు కంటెంట్ లో మేటర్ ఉందా లేదా తెలియాలంటే ట్రైలర్ వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.