ఆ మ్యాటర్‌లో.. లక్కీ సెంటిమెంట్ పక్కన పడేసిన నాచురల్ స్టార్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం నాచురల్ స్టార్‌గా దూసుకుపోతున్న నాని.. వరుస సినిమాల లైనప్‌తో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కెరీర్‌ను ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేసుకుంటూ రాణిస్తున్న నాని.. మొదట్లో లవర్ బాయ్ గా సపరేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు.. ఊరమాస్ యాంగిల్‌లో అడుగుపెట్టి.. తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం నాని సక్సెస్ సీక్రెట్ ఇదేనంటూ ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది.

Nani - IMDb

సినీ ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్లు వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్‌తో రిపీటెడ్‌గా సినిమాలు చేయడం సెంటిమెంట్‌గా భావిస్తూ ఉంటారు. కానీ.. నాని మాత్రం అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోడు. టాలెంట్ ఉంటే చాలు ఒకే డైరెక్టర్‌తో ఎన్ని సినిమాలు తీయడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. అంతేకాదు.. కొత్త దర్శకులకు సైతం నాని అవకాశాలు ఇచ్చి సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. అంటే సుందరానికి తర్వాత కూడా వివేకాత్రేయతో.. సరిపోదా శనివారం సినిమాను చేశాడు. దశర‌తో సూపర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓద్దెలతో కలిసి మరోసారి పారడైజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు హిట్ సిరీస్ ఫ్రేమ్ శైలేష్ కొల‌నుతో బలమైన ప్రొఫెషనల్ ర్యాపో ఏర్పరచుకుంటున్నాడు నాని.

Nani's Remuneration for HIT 3: Strategic Move for HIT Verse - Bigtvlive  English

ఇలాంటి క్రమంలో నాని మరో డైరెక్టర్‌కు అవకాశం ఇస్తున్నాడంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. హాయ్ నాన్నతో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ శౌర్యవ్‌కు మరో అవకాశం ఇచ్చాడట నాని. శౌర్యవ్‌కు తారక్ కోసం గతంలో స్టోరీ రెడీ చేసుకోగా.. ఎన్టీఆర్ బిజీ స్కెడ్యూల్‌తో దాన్ని వదులుకున్నాడని.. ఈ క్రమంలోనే మళ్లీ స్టోరీ కోసం నానిని సంప్రదించినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు తారక్ కోసం చేసినదేనా.. లేదా నాని కోసం సరికొత్తగా మరో కథను వినిపిస్తున్నాడా అనే క్లారిటీ లేకున్నా నాని మాత్రం శౌర్యవ్‌ కోసం మరో కథ సిద్ధం చేశాడు అన్నది మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.