‘ పుష్ప 1 ‘ తర్వాత ” ఐకాన్ ” రావాలి.. కానీ మోసం చేశారు.. దిల్ రాజు

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. ఆడియ‌న్స్‌ ముందుకు వస్తుంది అనుకున్న ఐకాన్.. సెట్స్‌పైకి రాకముందే ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమాపై దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనగా మారాయి. పుష్ప పార్ట్ 1 తర్వాత.. అల్లు అర్జున్ ఐకాన్ చేయాల్సి ఉంది. కానీ.. మధ్యలో పుష్ప పార్ట్ 2 వచ్చింది. మ‌రో ప్రాజెక్ట్ కూడా ఆయన ప్రకటించేసాడు. దీంతో మేము ఐకాన్ నుంచి అల్లు అర్జున్‌ను తప్పించామంటూ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

Allu Arjun wants pan-India release for Icon too - TeluguBulletin.com

త్వరలోనే కొత్త హీరోతో ఈ ప్రాజెక్టు మొదలవుతుందని క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఎన్నో ఊహాగానాల పై అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అయింది. బన్నీ బిజీ స్కెడ్యూల్ కారణంగా ఐకాన్ ప్రాజెక్టు మరింతగా ఆలస్యం అవుతుందని.. మాట వినిపించగా.. ఇప్పుడు అదే నిజమని క్లారిటీ వచ్చేసింది. పుష్ప పార్ట్ 1 తర్వాత బన్నీ రేంజ్ పెరగడంతో.. పెద్ద స్థాయిలో సినిమాలు చేయడం.. ఐకాన్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడు. తర్వాత బన్నీ.. అట్లీ మరియు త్రివిక్రమ్ సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ వచ్చే ఛాన్స్ లేదు. అంతేకాదు.. త్రివిక్రమ్ సినిమాని కూడా బన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడని టాక్.

ఈ క్రమంలోనే దిల్‌రాజు.. చేసేదేమీ లేక కొత్త హీరోతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడట. డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇప్పటికే స్క్రిప్ట్ను ఫైనలైజ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారడంతో.. ఐకాన్ ప్రాజెక్టుపై మరోసారి హైప్ పెరిగింది. ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్న ప్రశ్న ఈ సినిమా కోసం దిల్‌రాజు.. బన్నీ ప్లేస్‌లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది. మరి కొద్ది రోజుల్లో దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.