పవన్ ‘ వీరమల్లు ‘ క్లైమాక్స్ కు అన్ని కోట్లు ఖర్చయిందా.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాక్..!

ఏపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తను సైన్‌చేసిన ప్రాజెక్టుల‌తో ఆయన బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. ఈ క్రమంలోనే.. చివరిగా హరిహర వీరమల్లు పూర్తి చేశాడు పవన్. అయితే.. వాస్తవానికి నేడు ఈ సినిమా రిలీజ్ కావలసి ఉండగా.. విఎఫ్ఎక్స్‌ పనులు కార‌ణంగా సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించ‌గా.. ఏ.ఏం.జ్యోతి కృష్ణ, కృష్ సంయుక్తంగా సినిమా తెరకెక్కించారు.

భారీ హిస్టారికల్ ఇండియన్ మూవీగా ఈ సినిమా ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా.. 12సార్లు వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు షూట్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే తాజాగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ సైతం వాయిదా పడడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. అయితే మేకర్స్ త్వరలోనే మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా క్లైమాక్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైరల్ గా మారుతుంది. ఈ సినిమా విఎఫ్ఎక్స్ ప్రధానంగా కొనసాగుతుందట‌.

ఈ క్రమంలోనే ఏకంగా 600 విఎఫ్ఎక్స్ షార్ట్స్‌ సినిమాలో ఉపయోగించినట్లు సమాచారం. ప్రతి షాట్‌లో పది లేయర్స్ ఉంటాయట. ఇలా మొత్తంగా ఉండే విఎఫ్ఎక్స్‌ షాట్స్ అన్నీ ఒక రేంజ్ లో ఉంటే.. క్లైమాక్స్ వీటన్నింటినీ మించి పోయే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఒక ఈ విఎఫ్ఎక్స్ షార్ట్ కోసమే మేకర్స్ ఏకంగా రూ.25 కోట్లు పెట్టినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం క్లైమాక్స్.. ఖ‌ర్చు తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ మేకర్స్‌ కాంప్రమైజ్ కాకుండా.. ఆడియన్స్ అంచ‌నాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందించారని తెలుస్తోంది. ఇక సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో.. రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.