టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభరతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదు. చివరిగా వచ్చిన భోళా శంకర్ సైతం డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. మెగా అభిమానులంతా విశ్వంభర బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట డైరెక్షన్‌లో రూపొందుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ విశ్వంభర. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో సినిమా పై ఆసక్తి నెలకొంది.
త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించనున్న క్రమంలో.. మెగాస్టార్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకటే అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతుండగా.. మరొకటి డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలా తెరకెక్కిస్తున్న సినిమా కావడం విశేషం. శ్రీకాంత్.. సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. నాన్నకు ప్రేమతోచ, రంగస్థలం లాంటి బ్లాక్బస్టర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించిన శ్రీకాంత్.. తర్వాత నానితో.. దసరా సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నానితో మరోసారి ప్యారడైజ్ సినిమాను రూపొందిస్తున్నాడు.
అలాగే.. చిరుతోను సినిమాకు సైన్ చేపించుకున్నాడు. కాగా.. ఇప్పుడు చిరంజీవి, శ్రీకాంత్ ఓద్దెల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఓ రూమర్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. వీళ్ళిద్దరి కాంబోలో రానున్న ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కుతుందని.. ఇందులో భాగంగానే చిరంజీవి ఊర మాస్ లుక్‌లో కనిపించనిన్నాడని.. సినిమాలో హీరోయిన్ కానీ.. సాంగ్స్ కానీ.. ఉండవని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. చిరంజీవి సినిమాల్లో సాంగ్, హీరోయిన్ లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. లేదా.. అసలు ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో.. వేచి చూడాలి.