రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న వార్ 2.. అది ఎన్టీఆర్ బ్రాండ్..!

ఆర్ఆర్ఆర్‌ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న తారక్.. దేవరతో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకుని బాలీవుడ్ లోనే తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే నందమూరి హీరో.. బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ మూవీలో నటించిన‌ సంగతి తెలిసిందే. ఇక‌ వార్ గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ కాంబోలో రూపొందగా.. ఈ సినిమాకు సీక్వల్‌గా వార్ 2 తెర‌కెక్క‌నుంది. ఇప్పటికే సినిమా షూట్ ను పూర్తి చేసుకున్న టీం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక సినిమాను ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు టీం మొదట్లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండడంతో.. ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైపోయింది. అంతేకాదు.. రికార్డ్‌ లెవెల్లో సినిమా వసూళ్లు రాబడుతుందని సమాచారం.

https://www.imdb.com/title/tt27425164/

ఇప్పటికే వార్ 2 సినిమా.. ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.100 కోట్లు దాటిందని.. మొత్తం బడ్జెట్ రూ.300 కోట్లు కాగా.. ఫ్రీ రిలీజ్ కలెక్షన్ల ద్వారానే దాదాపు రూ.200 కోట్లు రాబట్టాలని టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్‌కి ముందే.. ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం టీంకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రమోషన్స్‌లో మరింత శ్రద్ధ పెట్టాలని.. సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫిక్స్ అయ్యారట టీం. అంతే కాదు.. సినిమాను విదేశాల్లో కూడా ప్రమోట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. తారక్‌కు జపాన్, చైనాలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న నేపథ్యంలో.. మూవీ టీం అక్కడ కూడా వార్ 2 ప్రమోషన్స్‌ను చేయనున్నారు. ఈ దక్షిణ భారత పంపిణీ హక్కులను ఎన్టీఆర్ అన్న‌ కళ్యాణ్ రామ్ కొనుగోలు చేయనున్నట్లు టాక్‌ నడుస్తుంది.

War 2 Release Date: Hrithik Roshan's film 'War 2' release date is out! This  special thing will create a stir | Latest News | Patrika News

ఇక అయాన్‌ ముక‌ర్జీ డైరెక్షన్‌లో రానున్న ఈ మూవీ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఇక ఈ సినిమాల్లో తారక్, హృతిక్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ పిక్స్ లెవెల్ లో ఉంటాయని.. ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండనుందని టాక్‌ నడుస్తోంది. ఇక ఇద్దరూ ఒకరిని మించి ఒకరు తోపు హీరోలుగా ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక వార్ 2 సినిమా షూట్ పూర్తి చేసుకున్న తారక్.. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక వరుసగా రెండు నెలల పాటు ఈ సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడపనున్నాడు తారక్. తర్వాత.. వార్ 2 ప్రమోషన్స్ కోసం బ్రేక్ తీసుకొని.. సినిమా రిలీజ్ అయ్యి వార్ 2 హడావుడి ముగిసిన వెంటనే.. మళ్ళీ డ్రాగన్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడట.