వెంకీ మామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీల లిస్ట్ ఇదే..!

తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. కాంట్ర‌వర్సీలకు దూరంగా ఉంటూ అందరూ హీరోలకు అభిమాన హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు.. అందరూ వెంకటేష్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు.. వెంకటేష్ సైతం క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల క్యారెక్టర్ లను పోషిస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ కెరీర్‌లో ఎక్కువగా సక్సెస్‌లు కనిపిస్తాయి.

Subash Chandra Bose (film) - Wikipedia

అయితే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. సినీ కెరీర్‌లో డిజాస్టర్లు, ఫ్లాప్ లు కచ్చితంగా ఉండనే ఉంటాయి. అలా.. ఇప్పటివరకు వెంకటేష్ సినీ కెరీర్‌లో వచ్చిన భారీ డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. అవి వెంకటేష్‌ను బాగా దెబ్బతీసాయనే చెప్పాలి. ఇంతకీ.. ఆ సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం. వాటిలో మొదటిది రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన సుభాష్ చంద్రబోస్. ఈ సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేక డీలా పడిపోయింది. మరొకటి మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన షాడో. ఈ రెండు సినిమాలు వెంకటేష్ కు బిగ్గెస్ట్ మైనస్లుగా మారాయి. ఇలాంటి నేపథ్యంలోనే కంటెంట్‌ మరింత జాగ్రత్తగా ఎంచుకుంటూ.. బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు వెంకటేష్. ఇప్పటికి ఆయన అదే రేంజ్ లో ఆడియన్స్‌ను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.

Shadow (2013) - IMDb

వెంకటేష్ రేంజ్ కు తగ్గ కథ ఒకటి పడితే కలెక్షన్ల భీభ‌త్సం ఖాయమని.. చివరగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి రుజువు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకోనున్నా అనేది.. తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇక వెంకటేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. కాగా వెంకటేష్ ఒక సినిమాకు కూడా త్రివిక్ర‌మ్ ఇప్ప‌టివ‌ర‌కు దర్శకత్వం వహించుకున్న.. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు మాత్రం త్రివిక్రమే రైటర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో రానున్న సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.