బాలయ్య కారణంగా చిరుతో సినిమానే చేయనన్న డైరెక్టర్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా దశబ్ద కాలంగా తిరుగులేని క్రేజ్‌తో రాణిస్తున్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో ఎంత స్ట్రాంగ్ పోటీ నెలకొన్న సరే.. వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. ఒకరి ఈవెంట్స్ కు మరొకరు హాజరై సందడి చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. గతంలో బాలయ్య కారణంగానే.. ఓ దర్శకుడు చిరంజీవితో సినిమా చేయ‌న‌ని చెప్పేసాడంటూ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. అసలు ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం.

Interview of B Gopal about 'Aaradugula Bullet'

కొంతకాలం క్రితం అశ్వినీ ద‌త్త్‌.. చిరంజీవి హీరోగా, బి. గోపాల్ డైరెక్షన్లో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా గోపాల్‌ను కలిసిన.. అశ్వినీ ద‌త్త్‌.. చిరంజీవి గారు మా బ్యానర్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. నువ్వు ఆ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించాలి.. చిన్ని కృష్ణ దగ్గర ఉన్న ఒక కథను విను.. అది నచ్చితే సినిమా చేసేద్దాం.. అని బి.గోపాల్‌కు వివరించాడట. దీంతో.. బి. గోపాల్, చిన్నికృష్ణ దగ్గర ఉన్న కథను విన్నారు. కానీ.. ఆ స్టోరీ ఆయనకు పెద్దగా నచ్చకపోవడంతో ఇలాంటి స్టోరీ తో నేను చిరంజీవి సినిమా చేయనని వివరించాడట. దీంతో ఒకరోజు స్టార్ రైటర్ అయిన పరుచూరి గోపాలకృష్ణ.. గోపాల్‌ను కలిసి నువ్వు ఎందుకు చిన్ని కృష్ణ దగ్గర ఉన్న స్టోరీని చిరంజీవితో చేయనని చెప్పావని అడిగారట.

స్టోరీలు సేమ్.. హీరోలు మాత్రం డిఫరెంట్.. అయినా బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించారు..

దానికి.. గోపాల్ నేను ఇప్పటికే బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి రెండు ఫ్రాక్షన్ సినిమాలు చేశా. చిన్ని కృష్ణ నాకు చెప్పిన కథ దాదాపు అలాగే ఉంది. ఇప్పటికే నేను చిరంజీవి గారితో మెకానిక్ అల్లుడు సినిమా తీసి ఫ్లాప్ చూశా. మరోసారి చిరంజీవి నావల్ల ప్లాప్ ఎదురుకోకూడదు. అందుకే నేను ఆ కథతో చిరంజీవి సినిమా చేయను అని చెప్పేసా అంటూ వివరించాడట. దీంతో.. పరుచూరి గోపాలకృష్ణ నువ్వు ఫ్రాక్షన్ కథలు చేసింది బాలకృష్ణతో కానీ.. చిరంజీవితో కాదు కదా. ఒకసారి చిన్న కృష్ణ దగ్గర ఉన్న కథతో చిరంజీవి హీరోగా ఫ్రాక్షన్ మూవీని రూపొందించి చూడు.. అది మంచి సక్సెస్ సాధిస్తుంది అంటూ వివరించాడ‌ట‌. దీంతో పరుచూరి గోపాలకృష్ణ మాటలకు కన్విన్స్ అయినా బి. గోపాల్, చిరంజీవి హీరోగా అశ్విని ద‌త్త్ ప్రొడ్యూసర్ గా.. చిన్ని కృష్ణ ఇచ్చిన కథతోనే ఇంద్ర సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కేవలం బ్లాక్ బస్టర్ హిట్ గానే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్ గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది.