టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. తాజాగా తారక్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ నుంచి టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఇకపోతే ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కొంతమంది వార్ 2 టీజర్ ప్రేక్షకులను నిరాశపరిచిందని.. అసలు ఎన్టీఆర్ కటౌట్, హృతిక్ రోషన్ సరిపడలేదని.. అసలు టీజర్ విఎఫ్ఎక్స్ బాగోలేదంటూ రకరకాల విమర్శలు కురిపించారు. కాగా.. ఈ సినిమా టీజర్ అదిరిపోయే రేంజ్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేసింది. అదేంటంటే తెలుగు వెర్షన్ టీజర్ యూట్యూబ్లో ఏకంగా 126 గంటల పాటు టాప్ 1 ట్రెండిగా కొనసాగింది. అంతేకాదు మరో రేర్ రికార్డు ఏంటంటే.. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో టీజర్ రికార్డ్ లను సైతం బ్లాస్ట్ చేసింది.
మహేష్ సరిలేరు నీకెవరు మూవీ టీజర్ రిలీజైన 123 గ్టలు టాప్ ట్రెండింగ్ పొజిషన్లో ఉంటే.. చరణ్ నటించిన లాస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ సినిమా యూట్యూబ్లో 123 గంటలు టాప్ 1 గా ట్రెండింగ్‌లో ఉంది. ఈ రెండు సినిమాల్లో టీజర్ రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ.. వార్ 2 మూవీ తెలుగు వెర్షన్ టీజర్ 126 గంటల పాటు యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్ గా నిలిచింది. ఇలా ఈ సినిమా టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. ట్రెండింగ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది.