టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది.. ఎవరి జాతకం ఎలా మారుతుంది.. ఏది ఎవరు చెప్పలేరు. దానికి తాజాగా మరో ఎగ్జామ్‌పుల్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నోసార్లు మొదటి ఒక హీరో కోసం అనుకున్న పాత్రను అతను రిజెక్ట్ చేయడం.. మరో హీరో ఆ పాత్రకు సెలెక్ట్ అయ్యి.. ఆ సినిమాతో పాజిటివ్ టాక్ తెప్పించుకుని.. బ్లాక్ బస్టర్ అందుకోవడం.. అప్పుడు ఆ సినిమా హిట్ అయితే.. రోల్‌ని వదిలేసిన హీరో డిసప్పాయింట్ వర్ణనాతీతం. అలాంటి బాధలు మన సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. కేవలం హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా అలాంటి టఫ్ సిట్యువేషన్లు హ్యాండిల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం ఈ పొజిషన్‌ను వార్ 2 వల్ల టాలీవుడ్ క్రేజీ హీరో ఫేస్ చేస్తున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
దానికి కారణం వార్ 2 మూవీ. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన.. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గురించి ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇంటర్నేషనల్ వైడ్‌గా అంతా.. ప్రస్తుతం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా.. తారక్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఈ టీజర్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక హాలీవుడ్ మూవీని తలపించే రేంజ్‌లో అయాన్ ముఖర్జీ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్స్ అయితే ఆడియన్స్‌ను పిక్స్ లెవెల్‌లో ఆకట్టుకుంటున్నాయి. హృతిక్ రోషన్ సిక్స్ ప్యాక్ వేరే లెవెల్ అంటూ.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకటి కాదు, రెండు కాదు.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అభిమానులకు ఏ ఏ ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్ ఫుల్ ప్యాకెట్ కంటెంట్‌తో వార్ 2ను రూపొందించాడు అయాన్ ముఖర్జీ. మొదట ఎన్టీఆర్ ప్లేస్ లో ఈ సినిమా కోసం మరో టాలీవుడ్ హీరోని భావించారట. అతను ఎవరో కాదు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఇదే న్యూస్ బాలీవుడ్ వార్తలలో వైరల్ అవుతున్నాయి. మొదట ఎన్టీఆర్ కోసం ప్రభాస్‌ను అప్రోచ్ అయిన అయాన్ ముఖర్జీ.. ఈ రోల్ కోసం కథను కూడా వినిపించాడట. కానీ.. అయాన్ రాసుకున్న రోల్ ప్రభాస్ కి సూట్ కాకపోవచ్చు అని ప్రభాస్ మేనేజర్ చెప్పడంతో.. ప్రభాస్ కూడా నిజమే ఈ పాత్ర నాకు సెట్ కాకపోవచ్చు అని రిజెక్ట్ చేసేసాడట. అలా.. ప్రభాస్ రిజెక్ట్ చేసిన రోల్ లో తారక్ సెటిలై పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఏంటి.. హృతిక్ పర్సనాలిటీకి, తారక్ పోటీనా.. అసలు వాళ్ళిద్దరి మధ్యన వార్ సెట్ అవుతుందా.. అనే సందేహాలు వ్యక్తం చేసిన అందరికీ తారక్ పెర్ఫార్మెన్స్ తో సమాధానం ఇచ్చాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ వేరే లెవెల్ అనేంతలా మెప్పించాడు.