ప్రొడ్యూసర్ గా నాని.. నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరో గానే కాదు.. నిర్మాతగాను తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే.. అది హీరోగా అయినా, లేక ప్రొడ్యూసర్ గా అయినా.. పక్క కంటెంట్ ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు జనం. ఈ క్రమంలోనే నాని సినిమాలకు మంచి టాక్ రావడంతో పాటు.. బ్లాక్ బ‌స్టర్ రిజల్ట్ అందుతుంది. అ! సినిమాతో మొదలైన నాని ప్రొడక్షన్.. హిట్ 3 తో ఇప్పటికీ అదే మానియాను కొనసాగిస్తుంది. తాజాగా.. నాని నుంచి వచ్చిన కోర్ట్‌ సినిమా సైతం భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రామ్ జగదీష్ రూపొందించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న క్రమంలోనే.. ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఎంతోమంది డైరెక్టర్ నానితో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారు.

ఒకసారి ఆయన చేతిలో పడితే.. డైరెక్టర్‌గా ఫేట్ మారిపోతుందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్ట్ సినిమా తర్వాత నాని నుంచి నెక్స్ట్ సినిమా ఏమీ ఉంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కాగా.. ప్రస్తుతం నిర్మాతగా వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సినిమాలు రూపొందిస్తున్న నాని.. అ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఏ సినిమా వచ్చిన సరే తప్పకుండా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. ఈ వాల్‌పోస్టర్ బ్యానర్ మాత్రమే కాకుండా.. యునానిమస్ అంటూ మరో బ్యానర్‌ను ప్రారంభించాడు నాని. ఈ బ్యానర్ పై స్టార్స్ తో సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యాడట.

వాల్ పోస్టర్ బ్యానర్ లో కంటెంట్ సినిమాలను రూపొందించని నాని.. ఏ నిమిషంలో నిర్మాతగా మారాలని ఫిక్స్ అయ్యాడో తెలియదు కానీ.. చాలా తెలివిగా కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ బ్రాండ్ వాల్యూను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు. నాని నుంచి సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా కంటెంట్ ఉంటుంది అని చెప్పవచ్చు. రియల్ కంటెంట్ సినిమాలను నాని ఎంకరేజ్ చేయాలని ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే దాన్ని వాల్ పోస్టర్ బ్యానర్‌లో నెక్స్ట్ సినిమా ఏమి ఉంటుందో చూడాలి. ఇక యునానిమల్స్ ప్రొడక్షన్లో మాత్రం.. మొదట మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓద్దెల కాంబో సినిమాను బ్లాక్ చేశాడు. నాని పారడైజ్ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓద్దెల చిరంజీవి సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే రివీల్ కానున్నాయి.

Chiranjeevi-Srikanth Odela film to have THIS time zone and backdrop |  Exclusive