భైరవం మూవీ రివ్యూ.. ముగ్గురు హీరోలు పడగొట్టారా.. హిట్ కొట్టారా..?

తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ త్రయం కలిసి న‌టించిన మూవీ భైరవం. 2016లో తమిళ్ ఇండస్ట్రీలో రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచిన గరుడాన్‌ సినిమాకు రీమేక్ గా భైరం మూవీ రూపొందింది. ఇక ఈ జినిమాను డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌లా.. తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు డిజైన్ చేశాడు. ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాగా.. ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుతుందో.. ముగ్గురు హీరోలు సినిమాతో హిట్ కొట్టారో.. లేదా ఒకసారి చూద్దాం.

స్టోరీ:
ఓ గ్రామంలో వారాహి అమ్మవారి టెంపుల్ నుంచి కథ మొదలవుతుంది. ఈ టెంపుల్ కు సంబంధించిన పత్రాలను, అమ్మవారి ఆభరణాలను త‌మ సొంతం చేసుకోవాల‌ని.. వాటిని కాజేయాల‌ని.. కొంద‌రు దుష్టులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌లు ఈ టెంపుల్‌కు సంబంధించిన వివరాలన్నింటినీ జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ ఉంటారు. ఈ నేప‌ద్యంలో గుడిని కాపాడేందుకు ఈ ముగ్గురు ప‌డిన క‌ష్టాలు, వీళ్ల ప్ర‌య‌త్నాలు, ఎలాంటి పాత్రలు పోషించారు.. చివ‌ర‌కు గుడికి సంబంధించిన విలువైన పత్రాలు, అమ్మవారి ఆభరణాలను కొట్టేయాలనుకున్న అసలు దొంగ ఎవరో కనిపెట్టారా.. లేదా.. తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ:
విజయ్ కనక మెడల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మలయాళ ఒరిజినల్ సినిమాకు యాస్ ఇట్ ఇజ్‌ గా తెర‌కెక్కించినట్లు అనిపించింది. ఫస్ట్ హ‌ఫ్ యావ‌రేజ్‌గా అనిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్‌ మాత్రం భారీ ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్‌లో సస్పెన్స్‌ పెట్టాడు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం ఆడియన్స్ లో హైప్‌ పెంచే సన్నివేశాలు అక్క‌డక్క‌డ‌ కనిపిస్తాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఫుల్ ఫ్ల‌జ్డ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చాలా వరకు ఆకట్టుకుందనే చెప్పాలి.

ఈ క్రమంలోనే డిఫరెంట్ క్యారెక్టర్ లో తనదైన నటనతో ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నాలు చేశాడు. ఇక సినిమాను డైరెక్టర్ ఏదైతే నమ్మి తెర‌కెక్కించాడో.. దాన్ని రీచ్ అయ్యేందుకు చాలా వరకు ప్రయత్నించినా.. అక్కడక్కడ తడబడినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇక గతంలో విజయ్ తెర‌కెక్కించిన నాంది, ఉగ్రం సినిమాల సైతం మంచి సక్సెస్ అందుకున్నాయి. కాగా.. ఈ రెండు సినిమాలు ఒకే టైప్ ఆఫ్ జానర్‌లో నడిచే కథలు. ఇక భైరవం విషయానికి వస్తే.. ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన సినిమా కనుక.. ఈ సినిమా హ్యాండిల్ చేసిన విధానంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడనే ఫీల్ కలిగింది. విజయ్ కి అనుభవం లేకపోవడంతోనే.. ఇలాంటి పొరపాట్లు జరిగి ఉండొచ్చు. మొత్తానికి సినిమా ప్రేక్షకుడిని కొంతమేర ఆకట్టుకుంది.

నటీనటుల పర్ఫామెన్స్:
ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు తమదైన రీతిలో సత్తా చాటుకునేందుకు ప్రయత్నించారు. ఎవ‌రి పాత్ర ప‌రిధిలో వాళ్లు న‌ట‌న‌తో న్యాయం చేశార‌నే చెప్పాలి. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన నటన ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషన్స్ సీన్స్ అయితే అదరగొట్టేసాడు. ఇక మంచు మనోజ్ దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాలో ఆయన రోల్ కూడా ఎంతో ప్రాధాన్యత ఉండడంతో.. తన పాత్ర పరిధిలో పూర్తి న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక నారా రోహిత్ సైతం ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలు నటించింది లేదు. ఈ క్రమంలోనే ఆయనకు ఇది కూడా స్ట్రాంగ్ రీ ఎంట్రీ అనే చెప్పాలి. ఇక భైరవంలో.. రోహిత్ త‌న‌ పాత్రతో మరోసారి తనను తాను నటుడిగా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసుకున్నాడు. శంకర్ కూతురు అతిధి శంకర్ సైతం తన నటనతో ఆకట్టుకుంది. ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ సినిమాకి సపోర్ట్ చేస్తూ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.

టెక్నికల్ గా:
టెక్నికల్గా సినిమాకు మ్యూజిక్ బిగ్ మైనస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఆడియన్స్ను ఆకట్టుకోదు. ఎగ్జిక్యూష‌న్లో టీం అసలు ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నట్లే అనిపించదు. ఇక సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల కుదిరిన.. అక్కడక్కడ కొన్ని షాట్స్ విజువల్ గా ఆడియన్స్ ఇబ్బంది పెట్టాయి. ఎడిటర్ కొంతవరకు పర్లేదు అనిపించిన.. కొన్ని సీన్లు, షార్ట్స్.. ఎడిట్ చేసే సమయంలో మరింత కత్తెరకు పని చెప్పల్సింది అనిపించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం కొంతమేర పర్లేదనిపించాయి.

ప్లస్ లు మైనస్ లు:
ఇంటర్వెల్ సస్పెన్స్‌, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ సినిమాకు ప్లస్ లుగా నిలిచాయి. ఇక మ్యూజిక్ సినిమాకు అతిపెద్ద మైనస్. కొన్ని అనవసరమైన సీన్లు, అన్‌వాంటెడ్ ఇల్లాజికల్స్ సన్నివేశాలు సినిమాకు మైనుస్‌ అయ్యాయని చెప్పాలి.

రేటింగ్ :2.8/5