టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సినిమా మార్కెట్ పెరుగుతున్న కొద్దీ.. తారల రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. అలా.. కొందరు హీరోలు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తూనే హీరోయిన్లకు కూడా వారు డిమాండ్ చేసిన రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అలా ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్లు ఛార్జ్ చేస్తున్నారు. కుర్ర హీరోయిన్లు కోటి రూపాయల నుంచి.. రెండు కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు మాత్రం లక్షల రెమ్యునరేషన్ అందుకోవడమే గొప్ప విషయం.

An actress who stunned a generation - Ileana D'Cruz!

అలాంటిది ఇండస్ట్రిలో దాదాపు 15 ఏళ్ల క్రితమే స్టార్ హీరోయిన్ కోటి రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకుంది. అయితే.. అలా మొట్టమొదట కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ అన‌గానే టక్కున శ్రీదేవి పేరు వినిపిస్తుంది. కానీ.. టాలీవుడ్‌లో మొట్టమొదటి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి కాదు.. శ్రీదేవి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రూపాయలు రెమ్యున‌రేష‌న్‌ తీసుకుంది. అయితే.. అది ఓ బాలీవుడ్ సినిమాకు కావడం విశేషం. ఇక తెలుగులో మొట్టమొదటి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ మాత్రం ఇలియానా. 2006లో దేవదాసు సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

Khatarnak Telugu Movie Review Ravi Teja Ileana Amma Rajasekhar

తర్వాత మహేష్ బాబుకు జోడిగా పోకిరి సినిమాలో నటించిన సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే విపరీతమైన పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన మూడో సినిమా కథ ఖ‌తర్న‌క్ కోసం.. కోటి రూపాయల రెమ్యునరేషన్‌ ఛార్జ్ చేసిందట. ఆమె మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ కావడంతో అప్పుడు నిర్మాతలు కూడా అదే రేంజ్ లో రెమ్యున‌రేష‌న్‌ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయినా ఇలియానా క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. తర్వాత కూడా వరుస‌ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ నాజుకు నడుము సుందరి.. తర్వాత తమిళ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ పై దృష్టి పెట్టిన ఈ అమ్మ‌డు సౌత్ సినిమా ఆఫర్లను వదులుకుంది. అయితే బాలీవుడ్ లో ఆమెకు సరైన సక్సెస్ రాకపోవడం.. తర్వాత సౌత్ లోనూ ఆఫర్స్ తగ్గడంతో.. ఇండస్ట్రీకి మెల్లమెల్లగా దూరమైంది.