నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు చెప్తే ఆయనకు చాలా కోపం ఎక్కువ.. కోపిస్ట్, అసలు ఆయనకు ఇండస్ట్రీలో స్నేహితులే ఉండరు.. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిపై అరుస్తూ ఉంటారు.. కోపాన్ని ఊరికే తెచ్చేసుకుంటారు.. ఏ విషయమైనా ఆయనతో ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారని అంతా భావిస్తారు. కానీ.. బాలయ్య సన్నిహితులు, ఆయనతో వర్క్ చేసిన వారు మాత్రం ఆయన మనస్తత్వం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. బాలకృష్ణది చిన్నపిల్లల మనస్తత్వం అని.. ఎలాంటి కల్మషం ఉండదని.. పైకి కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితంగా ఉంటారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.
టాలీవుడ్ నందమూరి నటసింహంగా భారీ పాపులారిటి దకక్కించుకున్న ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం అఖండ 2 సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇండస్ట్రీలో బాలకృష్ణను దాదాపు అందరూ గౌరవంగానే పిలుస్తూ ఉంటారు. కొంతమంది బాలయ్య బాబు అంటే మరికొంతమంది బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. కానీ.. ఆయనను ముద్దు పేరు పెట్టి క్లోజ్‌గా పిలిచేవారు. చాలా తక్కువ మంది ఉంటారు.
వాళ్ళల్లో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్.. బాలయ్య బాబును బాలా.. బాలా.. అంటూ క్రేజీ ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటాడట. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇండస్ట్రీలో అలా బాలయ్యను పిలిచే సాహసం ఎవరు చేయరు. అంత డేర్‌గా కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే పిలుస్తాడు. బాలకృష్ణ కూడా తన కెరీర్ లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో పని చేసినా.. పూరీ జగన్నాథ్ వర్క్ చేస్తే ఆ ఫీలే వేరని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది.