ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా ఉండే వెంకటేష్‌కి ఆ హీరోయిన్‌కు ఎందుకు మాట‌ల్లేవ్‌..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్‌ఖు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానాని సొంతం చేసుకున్న ఆయన.. వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. బడ బ్యాక్గ్రౌండ్‌తో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా అతి తక్కువ సమయంలోనే ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నా వెంకటేష్.. కాస్తయినా గర్వం చూపించరు. చిన్న.. పెద్ద.. అని తేడా లేకుండా అందరితోనూ సన్నిహితంగా ఉంటూ చురుకుగా మాట్లాడే ఆయన.. వివాదాలకు దూరంగా ఉంటారని సంగతి తెలిసిందే.

అలాంటి వెంకటేష్ సినీ కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లతో ఆడి పాడాడు. ఇక హీరోయిన్లతోను ఆయన ఎంతో ఫ్రెండ్లీగా, గౌరవంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి వెంకటేష్.. ఓ హీరోయిన్‌తో మాత్రం వైరం పెట్టుకున్నారని.. ఆ కారణంగానే ఇప్పటికే ఆమెతో మాట్లాడరని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆ హీరోయిన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండగా.. ఒకప్పుడు వెంకటేష్‌తో పాటు.. పలు సినిమాల్లో కో స్టార్‌గా నటించిన ఈ అమ్మడు.. ఆయ‌న‌ కంటే కూడా ఎక్కువగా రమ్నరేషన్ చార్జ్‌ చేసేదట. ఈ క్రమంలోని ఓ స్టార్ డైరెక్టర్, వెంకటేష్ కలిసి ఆ హీరోయిన్ తో సినిమా చేద్దామనుకున్నారట. కానీ.. కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదు.

Venkatesh (actor) - Wikipedia

మళ్ళీ అదే స్టోరీ తో కొన్నేళ్ల తర్వాత మరో స్టార్ హీరోయిన్ పెట్టి సినిమా తెర‌కెక్కించారు. ఇది నాకు వినిపించిన స్టోరీలానే ఉందే.. నన్ను కాదని మరో హీరోయిన్ ని ఎలా పెట్టుకుంటారని.. ఆ హీరోయిన్‌ వెంకటేష్ పై గొడవకు దిగిందట. దీంతో వెంకటేష్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారని.. అది దర్శక, నిర్మాతల నిర్ణయం.. నా ప్రమేయం అందులో లేదని చెప్పాడట. ఇక అప్పటినుంచి వీళ్ళ‌ మధ్య వార్‌ నడుస్తూనే ఉందని.. ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్యన మాటలు లేవు అని స‌మాచారం. ఈ విషయంలో ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన ఎవ్వరు వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేయలేదని.. దీనికి కారణం కూడా హీరోయిన్ మొండితనమైనని.. అమ్మే ముర్కత్వం వల్లే ఎవరు ఆమెన్ కల‌వ‌డానికి ఇష్టపడలేదట.