ఇండియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న సానియా మీర్జాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టెన్నిస్ ఆటలో ఎన్నో పథకాలను సాధించి రికార్డులు క్రియేట్ చేసిన ఈ అమ్మడు.. వ్యక్తిగత విషయాల పరంగా ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కొంది. ఇక కొంతకాలం క్రితం భర్తకు విడాకులు ఇచ్చిన ఈ అమ్ముడు.. ప్రస్తుతం సోలో లైఫ్ లీడ్ చేస్తుంది. కొడుకుతో కలిసి హైదరాబాదులోనే ఉంటుంది. కాగా.. సానియా మీర్జా 14 సంవత్సరాల తన మ్యారీడ్ లైఫ్‌కు స్వస్తి పలికింది. పాకిస్తాన్ నటుడు షోయబ్ మాలిక్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. అతను మరొక అమ్మాయితో ప్రేమాయణం నడుపుతూ రిలేషన్ లో ఉన్న కారణంగా అతనితో విభేదాలు ఏర్పడి డివర్స్ ఇచ్చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఇక సానియాతో డివోర్స్ తర్వాత షోయబ్.. పాకిస్థాన్ నటి.. సన జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా రెండో పెళ్లి కావడం విశేషం. ఇక ఇది జరిగిన తర్వాత సానియా మీర్జాన్ కూడా రెండో పెళ్లి చేసుకోమని ఆమె సన్నిహితులు ఎంతోమంది సలహాలు ఇచ్చారట. కానీ.. సానియా మాత్రం వాటిని పట్టించుకోకుండా కొడుకుతో కలిసి ఉండడానికే మక్కువ చూపింది. అయితే ఇండియన్ క్రికెటర్.. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని.. సానియా మీర్జా రెండో వివాహం చేసుకోబోతుందంటూ ఇటీవల కాలంలో చాలా వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే సానియా మీర్జా తండ్రి ఈ వార్తలను ఖండించాడు. కాగా తాజాగా మరోసారి ఓ టాలీవుడ్ హీరో తో సానియా మీర్జా ప్రేమాయణం నడుపుతుందని.. డేటింగ్ చేస్తుందంటూ పుకార్లు జోరు అందుకున్నాయి. ఆ హీరో ఎవరని అంశం బయటకు రాకపోయినా.. తప్పకుండా ఆమె తెలుగు హీరోనుపెళ్లి చేసుకోనుందంటూ వాదనలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె నిజంగానే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతుందా.. లేదా.. అనేది తెలియాలంటే సానియా మీర్జా రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.