టాలివుడ్ ఐకాన్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. పుష్పా 2తో ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడో తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ పుష్ప గెటప్‌లోనే ఉన్నారు. అయితే తాజాగా అయిన రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ కోసం నాంపల్లి కొర్ట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం కోర్టుకు వెళ్లిన బన్నీ.. తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. పుష్ప 2 కోసం పెంచిన గడ్డం, జుట్టు కత్తిరించి మాస్ నుంచి క్లాస్ లుక్ లోకి మారిపోయాడు.
ఇక కోర్ట్‌లో ఇద్దరు షూరిటీలను, 50 వేల పూచికత్తు తో సబ్మిట్ చేశాడు. ఈ కేసులో షూరిటీలుగా బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పర్సనల్ మేనేజర్ వ్యవహరించారు. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టు తాజాగా బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే బెయిల్ కండిషన్స్‌లో భాగంగా.. వ్యక్తిగతంగా కోర్ట్‌కు హాజరయ్యాడు అల్లు అర్జున్. కోర్టు ఆదేశాల మేర షూరిటీలను సమర్పించిన ఆయన తన నయా లుక్‌తో కనిపించిన పిక్స్ వైరల్గా మారుతున్నాయి.
ఇక కొర్ట్‌కు బన్నీ వస్తున్న క్రమంలో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత కారణాల దృశ్య అల్లు అర్జున్ కారును జడ్జీ లో ఎంట్రీ వరకు తీసుకువెళ్లాల్సి వచ్చింది.. అక్కడి నుంచి ఆయన కోర్ట్ వద్దకు వెళ్ళాడు. బెయిల్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అందించి ఆయన తిరిగి వెళ్లిపోయాడు. ఈ కేసులో మరోసారి ఈ నెల 10న వ్యక్తిగతంగా బన్ని హాజరు కావాల్సి ఉంది. ఆ తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసి.. అనంతరం కేసుపై విచారణ ప్రారంభించనున్నారు.