లెజెండ్ నేనంటే నేనంటూ కొట్టుకున్నారు.. మోహన్ బాబు, చిరు పై బాలయ్య ట్రోలింగ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 4 సీజన్ తాజా ఎపిసోడ్‌ నాకు మహారాజ్ టీం ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. థ‌మన్, డైరెక్టర్ బాబి, ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. అయితే ఇందులో భాగంగా బాలయ్య.. బాబితో మాట్లాడుతూ ఇప్పటివరకు బాబితో పనిచేసిన హీరోలు అందరి గురించి ఒక్కో మాట చెప్పాలంటూ.. వాళ్ళ ఫోటోలను స్క్రీన్ పై డిస్ప్లే చేశాడు. అయితే బాబీకి మొట్టమొదటి బ్లాక్ బ‌స్టర్ ఇచ్చిన ఎన్టీఆర్‌ను మాత్రం ఆ ఫొటోస్ లో జత చేయకపోవడంతో.. ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య పై ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌ను కావాలనే అవమానిస్తున్నాడు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. చిరు, మోహన్ బాబు ఫ్యాన్స్‌ను కూడా బాలయ్య టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసినట్లుగా డైలాగ్ చెప్పాడు.

Chiranjeevi Counters Mohan Babu - TrackTollywood

షోలో ఓ సందర్భంలో బాలయ్య మాట్లాడుతూ కట్టే కొట్టే తెచ్చే దీనికి పెద్ద వివరం చెప్పను.. ఒకనొక‌ టైంలో ఇండస్ట్రీలో పెద్ద గొడవ జరిగింది. దాని లోతుల్లోకి వెళ్ళను కానీ.. అక్కడ ఇద్దరు హీరోస్ పోట్లాడుకున్నారు. నేను లెజెండ్ అంటే.. నేను లెజెండ్ అని వాళ్ళు కొట్టుకుచచ్చారు. ఎవరు లెజెండ్ అంటే ఎవరు లెజెండ్ అంటూ.. నేను ఇన్నీ సినిమాలు చేశానని ఒకరు.. నాకు ఇంత అనుభవం ఉందని ఇంకొకరు.. అసలు లెజెండ్ ఎవరు.. నేను 50 ఏళ్లుగా ఇన్ని విభిన్న పాత్రలో నటిస్తున్నా.. గ్రామీణ, పౌరాణిక, ఫ్రాక్షన్, జానపద, సైన్స్ ఫ్రిక్షన్ మనం అడుగుపెట్టని జానర్ అంటూ లేదు.. జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయా.. నా సినిమాలను సక్సెస్ చేసి నన్ను ఇప్పుడు ఒక లెజెండ్ గా నిలబెట్టిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ.. నా అభిమానులందరికీ.. తెలుసు.

Balayya's 'Unstoppable with NBK' returns for Season 4 on Aha

లెజెండ్ అంటే ఎవరు నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటూ బాలయ్య పెద్ద డైలాగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ హీరోల పేర్లు ప్రస్తావించుకున్న గతంలో తెలుగు సినిమా వార్ష‌కోత్స‌వ‌ వేడుకల్లో మోహన్ బాబు, చిరంజీవి మధ్య జరిగిన లెజెండ్ గొడవ గురించి బాలయ్య ప్రస్తావించారని అందరికీ క్లారిటీ వచ్చింది. 500 కు పైగా సినిమాల్లో విభినమైన పాత్రలో చేసి ప్రొడ్యూసర్గా, రాజ్యసభ సభ్యుడుగా, విద్యాసంస్థల అధినేతగా ఉన్న తనను ఎందుకు లెజెండ్ గా గుర్తించరంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమ్మారం రేపింది. ఈ వ్యాఖ్యలు తర్వాత చిరు కూడా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాడు. తనకే లెజెండ్ స్టేటస్ వచ్చిందని.. మీరు చెప్పేవరకు ఈ అవార్డు తీసుకొనని చెబుతూ.. దాన్ని ఇక్కడే పెడతానంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అభిమానులు మర్చిపోరు. కాగా ఇలాంటి క్రమంలో అది కూడా డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్స్‌లో బాలయ్య చేసిన‌ కామెంట్స్ హ‌ట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. అనవసరంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. చిరు, మోహన్ బాబు అభిమానులకు కూడా బాలయ్య రెచ్చగొడుతున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.