టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా బడా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ హీరోగా లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకున్నా.. ఇప్పటికే అదే క్రేజ్‌తో బెంకీ మామ దూసుకుపోతున్న సంగతి తెలిసింది. ఇటీవల కాలంలో పలు మల్టీస్టారర్‌లలో నటించినా.. తర్వాత రానా నాయుడు వెబ్ సిరీస్లో ఆకట్టుకున్నాడు. ఇక ఏడది సంక్రాంతి బరిలో తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడో తెలిసిందే. ఆయన సినీ కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది.
ఇక ఇంత బడా బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్.. తన ఫ్యామిలీ గురించి కానీ, భార్య, పిల్లల గురించి కానీ వెంకీ ఎప్పుడు బయటపెట్టారు. ఫ్యామిలీ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతాడు. అంతేకాదు ఆయన భార్య నీరజతో కలిసి ఎప్పుడు ఎక్కువగా బయట కనిపించిందే లేదు. ఎలాంటి సినిమా ప్రమోషన్స్‌కు కూడా నీరజ హాజరు కాదు. ఇలాంటి క్రమంలోనే తమ ఫేవరెట్ హీరో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి.. ఆయన భార్య ఎవరో.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో.. తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వెంకీ మామ భార్య నీరజ బ్యాగ్రౌండ్ నెట్టింట వైరల్‌గా మారుతుంది. నీరజ రెడ్డి చిత్తూరు జిల్లా.. మదనపల్లికి చెందిన అమ్మాయి. తల్లిదండ్రులు గంగవరపు వెంకటసుబ్బారెడ్డి, ఉషారాణి. వీళ్లది పెద్ద జమీందారీ కుటుంబం.
వందలాది ఎకరాల భూమితో పాటు.. ఎన్నో వ్యాపారాలు వీళ సొంతం. ఇక అప్పుడే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుంటున్న వెంకటేష్ కు పెళ్లి చేయాలని భావించిన రామానాయుడు.. మంచి సంబంధం ఉంటే చెప్పాలని విజయ అధినేత నాగిరెడ్డికి వివరించాడట. దీంతో నెరజారెడ్డి కుటుంబం గురించి నాగిరెడ్డి.. రామానాయుడు కి చెప్పడం.. నాగిరెడ్డి సూచన మేరకు ముందుగా రామానాయుడు మదనపల్లి వెళ్లి నీరజ రెడ్డిని చూసి రావడం.. ఆయనకు వారి కుటుంబం, అమ్మాయి బాగా నచ్చడంతో వెంకటేష్ ని పిలిపించి పరిచయం చేయించారట. ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చడంతో.. 1989లో వెంకటేష్.. నేరజారెడ్డిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. నిరజా కూడా వెంకటేష్ లానే విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. ఎప్పుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం పట్టించుకోదు. చాలా సింపుల్ సిటీతో లైఫ్ని లీడ్ చేస్తూ.. భర్త ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండటంతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ అంతా చక్కదిద్దుకుంటుంది.